ASRB Recruitment 2026: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 1,393 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు రెడీ.. మంచి జీతం

Asrb Recruitment 2026

Asrb Recruitment 2026

ASRB Recruitment 2026: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు శుభవార్త. వ్యవసాయ శాస్త్రవేత్తల ఎంపిక మండలి (Agricultural Scientists Recruitment Board – ASRB) మొత్తం 1,393 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 18, 2026 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు డిసెంబర్ 17, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే డిసెంబర్ 18 నుంచి 20 వరకు దరఖాస్తు ఫారంలో తప్పులను సరిచేసుకునేందుకు అవకాశం కల్పించారు. నోటిఫికేషన్ వివరాల కోసం ఈలింక్ పై క్లిక్ చేయండి.
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను ఫిబ్రవరి 2027లో నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని వ్యవసాయ శాస్త్రవేత్తల ఎంపిక మండలి త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

విద్యార్హత విషయానికి వస్తే.. పోస్టులను అనుసరించి నిర్దేశించిన విద్యార్హతల్లో అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. వేతన శ్రేణి (Pay Scale): T-3: లెవల్-5 (రూ. 29,200 – 92,300/-); T-4: లెవల్-6 (రూ. 35,400 – 1,12,400/-)

దరఖాస్తు ఫీజు.. అన్‌రిజర్వ్డ్ (Unreserved) – ఒక్కపోస్ట్ కు రూ. 300- రెండు పోస్టులకు రూ. 600, EWS, OBC- ఒక్కపోస్ట్ కు రూ. 150- రెండు పోస్టులకు రూ. 300. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), దివ్యాంగులు (Persons with Benchmark Disabilities), మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మాజీ సైనికోద్యోగులకు (Ex-Servicemen) దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.