ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. మీరు డిగ్రీ, బీటెక్ పాసై ఖాళీగా ఉన్నట్లైతే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. కేంద్ర ప్రభుత్వ సంస్థ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. ఇంజనీర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది.
రైట్స్ లిమిటెడ్ ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 300 పోస్టులను భర్తీ చేయనున్నది. భర్తీకానున్న పోస్టుల్లో.. జియోఫిజిక్స్ 05, సీ ఎక్స్‌పర్ట్ 10, సోషల్ సైన్స్ 05, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 35, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ 15, మెకానికల్ ఇంజనీరింగ్ 90, కెమికల్ ఇంజనీరింగ్ 10, సివిల్ ఇంజనీరింగ్ 75, జియో టెక్నికల్ 05, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ 20, అర్బన్ ఇంజనీరింగ్(ఎన్విరాన్‌మెంట్) 05, ట్రాఫిక్ టీ అండ్ టీ 05, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ 05, జియాలజీ 05, ఆర్కిటెక్చర్ 10 పోస్టులున్నాయి.
అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, బీఆర్క్ /బీప్లానింగ్, బీఏ/బీఎస్సీ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. దీనితోపాటు ఉద్యోగానుభవం ఉండాలి. పోస్టులను అనుసరించి అభ్యర్థుల వయసు 31 నుంచి 38 ఏళ్లు కలిగి ఉండాలి. ఈ పోస్టులకు రాతపరీక్ష, టెక్నికల్ అండ్ ప్రొఫి షియన్సీ, కమ్యూనికేషన్ టెస్ట్,ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు ఇంజనీర్ పోస్టులకు రూ. 22,660, అసిస్టెంట్ మేనేజర్‌కు రూ. 23,340, మేనేజర్‌కు రూ. 25,504, సీనియర్ మేనేజర్‌కు రూ. 27,869 చెల్లిస్తారు. అభ్యర్థులు ఫిబ్రవరి 20 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.