ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండాల్సిన అవసరం లేదు. టెన్త్, ఇంటర్, ఐటీఐ క్వాలిఫికేషన్ తో కూడా జాబ్ కొట్టొచ్చు. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. మీరు కూడా పదోతరగతి అర్హతతో జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ కింద వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 246 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇందులో పోస్టుల వారీగా చూస్తే 215 పోస్టులు జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ 1కి, 23 పోస్టులు జూనియర్ అటెండెంట్ గ్రేడ్ 1కి, 8 పోస్టులు జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్ IIIకి కేటాయించారు. ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు టెన్త్ తో పాటు ITI/ హయ్యర్ సెకండరీ/ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. గరిష్ట వయస్సు 26 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.
ఈ పోస్టులకు సీబీటీ టెస్ట్, స్కిల్ టెస్ట్, తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 23 వేల నుంచి 78 వేల వరకు అందిస్తారు. దరఖాస్తు ఫీజు రూ. 300 చెల్లించాలి. SC, ST, PWD, మాజీ సైనికులకు ఫీజు నుంచి మినహాయింపు కలిపించారు. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 23 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం IOCL iocl.com పై క్లిక్ చేయండి.