NTV Telugu Site icon

Coal India MT Recruitment 2025: కోల్ ఇండియాలో మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్.. మిస్ చేసుకోకండి

Coal India Mt Copy

Coal India Mt Copy

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఫుల్ క్రేజ్ ఉంటుది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం తెగ ట్రై చేస్తుంటారు. అందుకే కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. లక్షలాది మంది పోటీ పడుతుంటారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మీరు కూడా జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కోల్ ఇండియా లిమిటెడ్ భారీ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా ఏకంగా 434 పోస్టులను భర్తీ చేయనున్నారు.

భర్తీకానున్న పోస్టు్ల్లో కమ్యూనిటీ డెవలప్ మెంట్ 20, పర్యావరణం 28, ఫైనాన్స్ 103, లీగల్ 18, మార్కెటింగ్ అండ్ సేల్స్ 25, మార్కెటింగ్ అండ్ సేల్స్ 25, మెటీరియల్ మేనేజ్ మెంట్ 44, పర్సనల్ అండ్ హెచ్ ఆర్ 97, సెక్యూరిటీ 31, కోల్ ప్రిపరేషన్ 68 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు పోటీపడే వారు ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి గ్రాడ్యుయేషన్, BE, B.Tech, B.Sc (ఇంజనీరింగ్), మాస్టర్స్ డిగ్రీ, PG, డిప్లొమా, CA లేదా ICWA వంటి సంబంధిత రంగాలలో డిగ్రీని పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు కలిగి ఉండాలి. రిజర్వ్డ్ కేటాగిరి వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

ఈ ఉద్యోగాలకు సీబీటీ టెస్ట్ ద్వారా అభ్యర్థలను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి ఈ2 గ్రేడ్ వారికి రూ. 50 వేల నుంచి రూ. 1.5 లక్షల జీతం ఉంటుంది. ఈ3 గ్రేడ్ వారికి రూ. 60 వేల నుంచి రూ. 1.8 లక్షల వరకు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు జనరల్ / ఓబీసీ (క్రీమీలేయర్ అండ్ నాన్ క్రీమీలేయర్) / ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1000/- +జీఎస్టీ – రూ.180/- మొత్తం రూ.1180 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ కోల్ ఇండియా లిమిటెడ్, దాని అనుబంధ సంస్థల ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 14 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.