Site icon NTV Telugu

Union Bank : బ్యాంక్ జాబ్ కావాలా?.. 2691 పోస్టులు రెడీ.. ఇక వద్దన్నా జాబ్

Bamk

Bamk

బ్యాంకింగ్ సెక్టార్ లో స్థిరపడాలనుకునే వారికి ఇదే మంచి ఛాన్స్. వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. బ్యాంక్ జాబ్ కావాలనుకునే వారు ఈ పోస్టులను అస్సలు వదలకండి. ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా 4 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపి కబురును అందించింది. దేశ వ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. బ్యాంక్ జాబ్ కోసం ట్రై చేస్తున్నవారు వెంటనే అప్లై చేసుకోండి.

Also Read:CM Revanth Reddy : తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

యూనియన్ బ్యాంక్ ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 2,691 పోస్టులను భర్తీచేయనున్నది. వీటిలో తెలంగాణలో 304, ఆంధ్రప్రదేశ్ లో 549 పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులకు పోటీపడేవారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. అభ్యర్థుల వయసు 20-28 ఏళ్లు కలిగి ఉండాలి. రిజర్వ్డ్ కేటాగిరి వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి. ఈ పోస్టులకు రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 15000 అందిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు మార్చి 5 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version