NTV Telugu Site icon

NCL: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లో 1,765 జాబ్స్.. రాత పరీక్ష లేదు.. వెంటనే అప్లై చేసుకోండి

Ncl

Ncl

ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీగా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. నిరుద్యోగులకు ఇదే మంచి సమయం. కొన్ని రకాల ఉద్యోగాలను ఎలాంటి రాత పరీక్ష రాయకుండానే సొంతం చేసుకోవచ్చు. జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న వారికి ఇలాంటి అవకాశమే వచ్చింది. నార్తర్న్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 1765 పోస్టులను భర్తీ చేయనున్నారు.

Also Read:Kishan Reddy: బేగంపేట్ రైల్వేస్టేషన్ మహిళలతో నడుపుతాం.. మహిళా లోకానికి ఈ రైల్వే స్టేషన్ అంకితం

ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెకానిస్ట్ వంటి ట్రేడుల్లో పోస్టులు భర్తీకానున్నాయి. ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు డిగ్రీ/ఇంటర్, డిప్లొమా/10వ తరగతితో పాటు ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 26 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్డ్ వర్గాలకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Also Read:TG Assembly: అసెంబ్లీలో రుణమాఫీపై చర్చ.. పల్లా వర్సెస్ ప్రభుత్వం

అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ఎటువంటి పరీక్ష లేకుండా నేరుగా మెరిట్ ప్రాతిపదికన జరుగుతుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు మార్చి 18 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.