Site icon NTV Telugu

Agniveer Vayu Jobs 2023: అగ్నివీర్ వాయులో 3500 ఉద్యోగాలకు నోటిఫికేషన్…పూర్తి వివరాలు..

Agniveer

Agniveer

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు లో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు..ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు 2023 రిక్రూట్‌మెంట్ కోసం వయోపరిమితి, విద్యార్హత , శారీరక ప్రమాణాలను తనిఖీ చేయండి.. ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ వాయు రిక్రూట్‌మెంట్ కింద అగ్నివీర్ పోస్ట్ కోసం 3500 ఖాళీలను భర్తీ చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దరఖాస్తులను ఆహ్వానించింది..ఆసక్తి, అర్హత కలిగిన వాళ్ళు శరీర కొలతలను కూడా చెక్ చేసుకోవాలి.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనేవారి వయస్సు 18 ఏళ్లు ఉండి, ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి..

obsజూలై 27, 2023
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ :ఆగస్టు 17, 2023
పరీక్ష తేదీ: అక్టోబర్ 13, 2023
బ్యాచ్ : 01/2024

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు విద్యా అర్హత రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ముఖ్యమైన అవసరం. అభ్యర్థులు పోస్ట్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు కింది అర్హతలను కలిగి ఉండాలి..

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు విద్యా అర్హతలు..

సైన్స్ సబ్జెక్ట్ అర్హత.. సెంట్రల్, స్టేట్ మరియు యుటి ద్వారా గుర్తించబడిన విద్యా బోర్డుల నుండి కనీసం 50% మార్కులతో గణితం, ఫిజిక్స్ మరియు ఇంగ్లీషుతో ఇంటర్మీడియట్/10+2/తత్సమానం ఉత్తీర్ణత. అలాగే ఆంగ్లంలో 50% మార్కులు. లేదా.. డిప్లొమా కోర్సులో కనీసం 50% మార్కులు ,ఆంగ్లంలో 50% మార్కులతో సెంట్రల్, స్టేట్ ,యుటి గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ నుండి ఇంజనీరింగ్ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) 3 సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణత. లేదా.. సెంట్రల్, స్టేట్ ,యుటి ద్వారా గుర్తించబడిన విద్యా బోర్డుల నుండి నాన్-వోకేషనల్ సబ్జెక్ట్ ఫిజిక్స్ మరియు మ్యాథ్‌తో 2-సంవత్సరాల వొకేషన్ కోర్సులో ఉత్తీర్ణత మొత్తం 50% మార్కులు మరియు ఆంగ్లంలో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి..

అదే విధంగా కనీసం 50% మార్కులు మొత్తం ,ఇంగ్లీషులో 50% మార్కులతో సెంట్రల్, స్టేట్ మరియు యుటి ద్వారా గుర్తించబడిన విద్యా బోర్డుల నుండి ఏదైనా స్ట్రీమ్‌లు/సబ్జెక్ట్‌లలో ఇంటర్మీడియట్/10+2/తత్సమానం ఉత్తీర్ణత. లేదా..కనీసం 50% మొత్తం , ఆంగ్లంలో 50% మార్కులతో సెంట్రల్, స్టేట్ యుటి ద్వారా గుర్తించబడిన విద్యా బోర్డుల నుండి 2 సంవత్సరాల వొకేషన్ కోర్సులో ఉత్తీర్ణత అయ్యి ఉండాలి.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవాళ్ళు పూర్తి సమాచారాన్ని తెలుసుకొని అప్లై చేసుకోవాలి..

Exit mobile version