NTV Telugu Site icon

Yahya Sinwar: ఏం గతి పట్టింది..ఇజ్రాయిల్‌కి భయపడి ఆడవేషంలో హమాస్ కీలక నేత..

Hamas Cheif Sinwar

Hamas Cheif Sinwar

Yahya Sinwar: అక్టోబర్ 7 నాటి హమాస్ దాడి తర్వాత, ఇజ్రాయిల్ ఉగ్రసంస్థపై విరుచుకుపడుతోంది. ముఖ్యంగా గాజా ప్రాంతంలో ఒక్క హమాస్ కార్యకర్త లేకుండా వారిని హతం చేస్తోంది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ దాడికి ఇప్పటికే హమాస్ దాదాపుగా కకావికలం అయింది. మరోవైపు అగ్రనేతల్ని ఇజ్రాయిల్ వెతికి వేటాడి మట్టుపెడుతోంది. ఏ దేశంలో, ఎంత భద్రత మధ్య ఉన్నా కూడా వదిలిపెట్టడం లేదు. ఇక గాజాలోని హమాస్ టెర్రరిస్టుల్ని దొరికిన వాడిని దొరికినట్లు చంపేస్తోంది.

ఇప్పటికే హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియేని ఏకంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోనే మట్టుపెట్టింది. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ ప్రమాణస్వీకారానికి వచ్చిన సందర్భంలో హనియే ఉంటున్న హోటల్‌ గదిలో పేలుడు జరిగింది. దీంతో అతను మరణించాడు. ఈ ఘటన మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు కారణమైంది. అయితే, ఈ దాడిని తాము చేసినట్లు ఇజ్రాయిల్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇదిలా ఉంటే, హమాస్ మిలిటీరీ వింగ్ కీలక నేతగా ఉన్న మహ్మద్ డెయిఫ్‌ని కూడా ఇజ్రాయిల్ దాడిలో మరణించాడు.

Read Also: Extramarital affair: ఛీ నువ్వు తల్లివేనా..? లవర్‌తో పారిపోయేందుకు కూతురి హత్య.. “క్రైమ్ పెట్రోల్‌” ఐడియా..

ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ అంటేనే భయపడి చస్తున్నారు హమాస్ నేతలు. ప్రస్తుతం హమాస్ చీఫ్‌గా ఉన్న యాహ్యా సిన్వార్ భయంతో మహిళా దుస్తుల్లో తప్పించుకుని తిరుగుతున్నట్లు పలు కథనాలు వెల్లడించాయి. ఇతను గాజా ప్రజల మధ్యలో మహిళా వేషధారణలో ఉన్నట్లు ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సోర్సెస్‌ని ఉటంకిస్తూ వెస్ట్రన్ మీడియ కథనాలను ప్రచురించింది. గాజాలోని హామాస్ సొరంగ వ్యవస్థ నుంచి బయటకు వచ్చిన అతను, తనని గుర్తించకుండా మహిళలాగా దుస్తుల్ని ధరిస్తున్నట్లు ఆదివారం న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. గత కొంత కాలంగా ఇజ్రాయిల్ సిన్వార్‌ కోసం వేట సాగిస్తోంది. ఈ క్రమంలోనే తరుచుగా తాను ఉండే చోటుని మారుస్తూ తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.

జూలై 31 టెహ్రాన్‌లో ఇస్మాయిల్ హనియే హత్య తర్వాత హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్‌గా యాహ్యా సిన్వార్ నియమితులయ్యాడు. సిన్వాన్ సమాచారాన్ని మార్పిడి చేసుకునేందుకు కొరియర్లపై ఆధారపడి ఉన్నాడు. ఒక వేళ ఎలక్ట్రానిక్ పరికరాలను వాడితే ఇజ్రాయిల్ తనను కనిపెట్టి చంపేస్తుందని వాటిని వాడటం లేదు.

Show comments