ఆల్రెడీ మొబైలో రంగంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన షావోమి సంస్థ.. ఇప్పుడు కొత్తగా స్మార్ట్ ఫ్యాన్‌ను లాంచ్ చేసింది. చూడ్డానికి మనం రెగ్యులర్‌గా వినియోగించే టేబుల్ ఫ్యాన్‌లాగే అనిపిస్తుంది. కానీ, ఇందులో దిమ్మతిరిగే అధునాతన ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. షావోమి స్మార్ట్ స్టాండింగ్ ఫ్యాన్ 2 పేరుతో వస్తోన్న ఈ ఫ్యాన్‌లో అలెక్సా, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఈ ఫ్యాన్ ఆన్ చేయడానికి గానీ, ఆఫ్ చేయడానికి తరచూ ప్లగ్ ఆన్ – ఆఫ్ చేయాల్సిన పని లేదు.. కూర్చున్న చోటు వద్ద నుంచే వాయిస్ కమాండ్‌తో ఆపరేట్ చేయొచ్చు.
అంతేకాదు.. 100 స్పీడ్ లెవెల్స్‌త పాటు త్రీ-డైమెన్షల్ ఎయిర్‌ఫ్లోని అందించారు. దీనిని బీఎల్డీసీ కాపర్ వైర్ మోటార్‌తో తయారు చేశారు. సాధారణ అల్యూమినియం మోటార్‌తో పోలిస్తే.. కాపర్ మోటార్ ఎక్కువ కాలం పని చేస్తుంది. స్టాండింగ్ & టేబుల్ డ్యుయెల్ మోడ్స్ కలిగి ఉండే ఈ ఫ్యాన్‌ను మనం స్మార్ట్‌ఫోన్‌కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. 55.8 డెబిబుల్ నాయిస్ లెవెల్ ఎయిర్‌ఫ్లోని అందిస్తుంది కాబట్టి.. ఈ ఫ్యాన్ తిరుగుతున్నా, నాయిస్ పెద్దగా ఉండదు. అసలు ఫ్యాన్ తిరుగుతోందా? లేదా? అన్న భావన కలుగుతుంది. 100 వరకు స్పీడ్ లెవెల్స్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్ ధరను రూ. 6,999గా కేటాయించారు.
అయితే.. సేల్‌లో భాగంగా జులై 18లోపు ఈ ఫ్యాన్‌ని కొనుగోలు చేస్తే, రూ. 1000 ఆఫర్ లభిస్తుంది. అంటే, రూ. 5,999 లకే దీనిని సొంతం చేసుకోవచ్చన్నమాట! యానివర్సరీ సెలెబ్రేషన్స్‌లో భాగంగా ఈ ఆఫర్ ఇస్తున్నారు. mi.com వెబ్‌సైట్‌లో ఈ ఫ్యాన్ కొనుగోలు చేయొచ్చు.
