Site icon NTV Telugu

WWE – Sara Lee: మాజీ రెజ్లర్ సారా లీ హఠాన్మరణం.. కారణం చెప్పని తల్లి

Sara Lee Died

Sara Lee Died

WWE Former Wrestler Sara Lee Died At 30: వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌(డబ్ల్యూడబ్ల్యూఈ) రంగంలో విషాదం చోటు చేసుకుంది. తన ప్రదర్శనతో రెజ్లింగ్ అభిమానుల్ని అలరించిన మాజీ రెజ్లర్‌ సారా లీ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె తల్లి టెర్రీ లీ ధృవీకరించారు. తమ కుమార్తె ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోయిందంటూ.. ఉద్వేగపూరిత నోట్‌ను షేర్ చేశారు. ఈ విషాద సమయంలో తమకు ప్రైవసీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన ఆమె.. సారా లీ మరణానికి గల కారణాలేంటో వెల్లడించలేదు. ఆమె వయసు కేవలం 30 సంవత్సరాలే!

కాగా.. సారా లీ మృతి పట్ల డబ్ల్యూడబ్ల్యూఈ రంగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మహిళా క్రీడాలోకంలో సారా లీ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిందని, ఇప్పుడు ఆమె లేరనే వార్త తీవ్రంగా కలచివేస్తోందని పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె కుటుంబం, స్నేహితులు, అభిమానులకు సంతాపం తెలిపింది. ఇదే సమయంలో.. సారాతో కలిసి జర్నీ చేసిన మహిళా రెజ్లర్లు ఆమెతో ఉన్న తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సారా మరణవార్త విని హృదయం ముక్కలైందని, ఈ విషాదాన్ని ఎలా తట్టుకోవాలో అర్థం కావడం లేదంటూ సరాయా, చెల్సీ గ్రీన్‌ ట్వీట్ చేశారు. అలాగే.. ఆమెతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు.

ఇదిలావుండగా.. 2015లో డబ్ల్యూడబ్ల్యూఈ రియాలిటీ కాంపిటీషన్‌‌లో సారా లీ ‘టఫ్‌ ఎనఫ్‌’ సిరీస్‌ విజేతగా నిలిచింది. ఇంకా మరెన్నో విజయాల్ని నమోదు చేసిన ఈమె.. తన సహచర రెజ్లర్‌ వెస్టిన్‌ బ్లేక్‌ను పెళ్లాడిందని, అతనితో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిందని సమాచారం.

Exit mobile version