Site icon NTV Telugu

Worlds Oldest Panda: దీర్ఘకాలం జీవించిన మగ పాండా మృతి

World Oldest Male Panda Die

World Oldest Male Panda Die

Worlds Oldest Male Panda Dies At 35 In Hong Kong Zoo: ప్రపంచంలోనే దీర్ఘకాలం జీవించిన మగ పాండా ‘అన్ అన్’ గురువారం తుదిశ్వాస విడిచింది. కొన్నేళ్లుగా హాంకాంగ్ ఓషన్ పార్క్‌లో సందర్శకుల్ని అలరిస్తోన్న ఈ 35 ఏళ్ల పాండా.. గత మూడు వారాల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో, ఈ పాండాను చూసేందుకు సందర్శకుల్ని అనుమతించలేదు. క్రమంగా దీని ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఓషన్ పార్క్ పశు వైద్యులు.. ఆ పాండా మరింత బాధ పడకుండా ఉండేందుకు, వైద్య ప్రక్రియలో భాగంగా కారుణ్య మరణాన్ని ప్రసాదించారు.

1999లో ఈ అన్ అన్ పాండాతో పాటు జియా జియా అనే ఆడ పాండాను హాంకాంగ్‌కు చైనా బహుమతిగా ఇచ్చింది. జియా జియా 38 ఏళ్ల వయసులో 2016లో మరణించింది. ఇప్పుడు అన్ అన్ మృతి చెందడంతో.. ఓషన్ పార్క్ నిర్వాహకులు మనోవేదనకు గురయ్యారు. అన్ అన్ మృతిని ప్రకటిస్తున్నందుకు ఓషన్ పార్క్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు. అన్ అన్ తమ కుటుంబంలో ఒక భాగమైందని, స్థానికులు సహా టూరిస్టులతో అది బలమైన బాండింగ్ ఏర్పరుచుకుందని అన్నారు. కాగా.. ఈ పాండా సౌత్-వెస్టర్న్ చైనీస్ ప్రావీన్స్‌లోని సిచువాన్‌లో 1986లో జన్మించింది.

Exit mobile version