Gold deposits: చైనాలో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలు బయటపడ్డాయి. జియోలజిస్ట్ శాస్త్రవేత్తలు 2 కి.మీ లోతులో ఈ బంగారు నిక్షేపాలను గుర్తించారు. దాదాపుగా 1000 మెట్రిక్ టన్నుల అధిక నాణ్యత కలిగిన బంగారం ఉంటుందని అంచనా వేశారు. చైనీస్ స్టేట్ మీడియా నివేదించిన దాని ప్రకారం.. ఈ అన్వేషణ విలువ దాదాపుగా 83 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.7 లక్షల కోట్లు)గా ఉంటుందని చెప్పింది. ఇది దక్షిణాఫ్రికాలోని సౌత్ డీప్ బంగారు గనిని అధిగమించింది. ఇక్కడ 900 మెట్రిక్ టన్నులు బంగారం ఉంది. ఇప్పుడు దీనిని చైనాలోని బంగారు నిల్వలు అధిగమించాయి.
Read Also: Rahul Gandhi: ‘‘బైడెన్, మోడీలపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు’’.. తప్పుపట్టిన ఫారెన్ మినిస్ట్రీ..
ఈ బంగారు నిక్షేపాలు హునాన్ ప్రావిన్సులోని పింగ్జియాంగ్ కౌంటలో ఉందని చెప్పారు. బంగారు నిక్షేపాలు వివిధ భౌగోళిక ప్రక్రియల ద్వారా ఏర్పడుతాయి. మిలియన్ ఏళ్లుగా ఒత్తిడి, వేడి, భూమి క్రస్ట్‌లోని వివిధ పరిస్థితుల మూలంగా బంగారం ఏర్పడుతుంది. ప్రతీ మెట్రిక్ టన్ను 138 గ్రాముల బంగారాన్ని ఇవ్వగలదని చైనీస్ సైంటిస్టులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతీ మెట్రిక్ టన్ను ధాతువు సాధారణంగా 8 గ్రాముల కంటే ఎక్కువగా ఇస్తే, దానాని హై గ్రేడ్‌గా వర్గీకరిస్తారు.