Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..
- ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్..
- ఆరో స్థానంలో భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్యదేశంగా పాకిస్తాన్ నిలిచింది. స్విట్జర్లాండ్‌కు చెందిన IQAir విడుదల చేసిన 2025 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రకారం.. పాకిస్తాన్లో ఎక్కువ కాలుష్యం ఉన్నట్లు వెల్లడించింది. పాకిస్తాన్ తర్వాత స్థానాల్లో బంగ్లాదేశ్, తజకిస్తాన్ నిలిచాయి. భారత్ ఈ జాబితాలో ఆరోస్థానంలో ఉంది. ఈ నివేదికను 143 దేశాల్లోని 9446 నగరాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా 40,000కి పైగా మానిటరింగ్ స్టేషన్ల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఫలితాలు వెల్లడించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నిర్దేశించిన PM2.5 ప్రమాణాలను కేవలం 13 దేశాలు మాత్రమే పాటించినట్లు నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో ఫ్రెంచ్ పాలినేషియా, ప్యూర్టో రికో, యూఎస్ వర్జిన్ ఐలాండ్స్, బార్బడోస్, న్యూ కాలెడోనియా, ఐస్లాండ్, బెర్ముడా, రీయూనియన్, అండోరా, ఆస్ట్రేలియా, గ్రెనడా, పనామా, ఎస్టోనియా దేశాలు ఉన్నాయి. మిగతా 91 శాతం దేశాల్లో ఈ ప్రమాణాలకు మించి కాలుష్యం నమోదైంది.
Also Read
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
Read Also: Monalisa: శరీరాన్ని అసభ్యంగా తాకేవాడని అమ్మానాన్నకి చెబితే సర్దుకుపోమన్నారు.. మోనాలిసా సంచలన ఆరోపణలు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత కాలుష్య నగరాలు ఎక్కువగా భారత్, పాకిస్తాన్, చైనా దేశాల్లో ఉన్నట్లు చెప్పింది. ముఖ్యంగా భారత్‌లోని లోని అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. ఆ తర్వాత చైనాలోని హోటాన్, భారత్‌లోని మేఘాలయాలోని బైర్నిహట్ ఉన్నాయి. ఢిల్లీ నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్ ఉంది.
అత్యంత పరిశుభ్రమైన నగరంగా దక్షిణాఫ్రికాలోని న్యూవౌడ్విల్లే నిలిచింది. ఇక ప్రపంచంలోన అత్యంత కలుషితమైన దేశాల జాబితాలో చైనా 20వస్థానంలో, అమెరికా 120వ స్థానంలో, యూకే 110వ స్థానంలో ఉన్నాయి.
తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?