Site icon NTV Telugu

కరోనా పుట్టింది ఎక్కడ..? మరోసారి రంగంలోకి డబ్ల్యూహెచ్‌వో..!

కరోనా మహమ్మారి చైనాలో పుట్టింది..! ప్రపంచాన్ని మొత్తం చుట్టేసింది అనే ప్రచారం ఆది నుంచి జరుగుతోంది.. అది కరోనా వైరస్‌ కాదు.. చైనా వైరస్‌ అంటూ.. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించడం వివాదాస్పంగా మారింది. ఇక, చైనాపై ప్రతీఒక్కరు దుమ్మెత్తిపోశారు.. సోషల్‌ మీడియా చైనాను ఓ ఆటాడుకుంది.. అంతేకాదు.. కోవిడ్‌ ఆనవాళ్లపై ఇప్పటికే చైనాలో కూడా పర్యటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన శాస్త్రవేత్తల బృందం.. కానీ, కోవిడ్‌ 19 చైనానే పుట్టింది అనే అనావాళ్లను మాత్రం సంపాదించలేకపోయింది. అయితే, కోవిడ్‌ మూలాలను తేల్చేందుకు మ‌రోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ ద‌ర్యాప్తు చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది.. కరోనా పుట్టుకపై రెండోసారి డ‌బ్ల్యూహెచ్‌వో విచార‌ణ చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వాల్ స్ట్రీట్ జ‌ర్నల్.. తన కథంలో పేర్కొంది..

కాగా, చైనాలోని వుహాన్ నుంచి వైర‌స్ వ్యాపించింద‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఇప్పటికే డ‌బ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం ద‌ర్యాప్తు చేసింది.. అయితే, ఆ బృందం వుహాన్‌పై ఎటువంటి అనుమానాలు లేవ‌ని స్పష్టం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.. కానీ, ఈ సారి మాత్రం.. అటోఇటో తేల్చేందుకే సిద్ధం అవుతోంది.. దాదాపు 20 మంది శాస్త్రవేత్తల‌తో మ‌ళ్లీ కరోనా మహమ్మారి పుట్టుకపై అధ్యయనం చేసేందుకు సిద్ధం అవుతోంది. ఆధారాల కోసం అధ్యయ‌నం చేయడంతో పాటు.. వుహాన్ ల్యాబ్ నుంచి క‌రోనా వైర‌స్ వ్యాపించిన‌ట్లు వ‌స్తున్న ఆరోప‌ణ‌ల్ని కూడా దృష్టిసారించనుంది డబ్ల్యూహెచ్‌వో. ఇక, ఏ విషయాన్ని వదలకుండా అనే తరమాలో.. కొత్త టీమ్‌లో ల్యాబ‌రేట‌రీ సేఫ్టీ స్పెష‌లిస్టులు, బ‌యోసెక్యూర్టీ నిపుణులు, జెన్యు స్టడీలో ఎక్స్‌పర్ట్స్‌కు కూడా చేర్చింది డబ్ల్యూహెచ్‌వో.. సార్స్ సీవోవీ2 వైర‌స్ ఆన‌వాళ్ల గురించి వాళ్లంతా స్టడీ చేయనున్నారని తెలుస్తోంది.

Exit mobile version