NTV Telugu Site icon

ఒమిక్రాన్‌ వేరియంట్.. డబ్ల్యూహెచ్‌వో తాజా వార్నింగ్‌

కరోనా మహమ్మారి కొత్త కొత్త వేరియంట్లుగా దాడి చేస్తూనే ఉంది.. తాజాగా సౌతాఫ్రికాలో వెలుగు చూసిన వేరియంట్.. జెట్‌ స్పీడ్‌తో ఎటాక్‌ చేస్తోంది.. కేవలం నాలుగు రోజుల్లోనే 14 దేశాలను తాకేసింది.. దీంతో, అప్రమత్తమైన దేశాలు.. ఆంక్షలు విధిస్తున్నాయి… ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డ‌బ్ల్యూహెచ్‌వో) కీల‌క వ్యాఖ్యలు చేసింది… కొత్త వేరియంట్ B.1.1.529 ప్రభావాన్ని మదింపు చేసేందుకు కొంత సమయం పడుతుందని.. కొద్ది వారాల తర్వాత దాని ప్రభావాన్ని మదింపు చేయగలమని పేర్కొంది..

అయితే, కొత్త వేరియంట్‌ భయంతో ఐరోపా దేశాలు ద‌క్షిణాఫ్రికా నుంచి వ‌చ్చే విమానాల రాక‌పోక‌ల‌ను నిషేధిస్తున్న నేపథ్యంలో.. డబ్ల్యూహెచ్‌వో ఈ వ్యాఖ్యలు చేసింది.. కొత్త వేరియంట్‌ కట్టడికి ప్రయాణలపై విధించే ఆంక్షల విషయంలో శాస్త్రీయ ధోర‌ణితో నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొంది డబ్బ్యూహెచ్‌వో.. ప్రయాణ నియంత్రణ‌ల‌కు బ‌దులుగా అంత‌ర్జాతీయ ఆరోగ్య నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని సూచించింది.. అంతేకాదు.. మిగతా వేరియంట్లతో పోలిస్తే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుందనే అంశాలపై ఇంకా క్లారిటీ రాలేదని స్పష్టం చేసింది డబ్ల్యూహెచ్‌వో.