Site icon NTV Telugu

ఎల‌న్ మ‌స్క్ అరుణ‌గ్ర‌హ యాత్ర క‌ల నిజ‌మౌతుందా?

ఎల‌న్ మ‌స్క్ అంత‌రిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ మ‌రో అంకానికి తెర‌తీసింది.  అంగార‌క గ్ర‌హం మీద‌కు ప్ర‌యాణికుల‌ను పంపేందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేస్తున్న‌ది.  స్టార్ షిప్ పేరుతో ఓ భారీ వ్యోమ‌నౌక‌ను తయారు చేస్తున్న‌ది.  ఇందులో 100 మంది వ‌ర‌కు ప్ర‌యాణం చేసే అవ‌కాశం ఉంటుంద‌ని స్పేస్ ఎక్స్ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  ఈ స్టార్ షిప్‌ను రీయూజ‌బుల్ మోడ‌ల్‌లో త‌యారు చేస్తున్నారు.  120 మీట‌ర్ల పొడవున్న ఈ స్టార్ షిప్‌లో ఆరు రాప్ట‌ర్ ఇంజ‌న్లు ఉంటాయి.  ఇక భూమి నుంచి అరుణ‌గ్ర‌హం చేరుకోవ‌డానికి క‌నీసం 9 నెల‌ల స‌మ‌యం పడుతుంది.  ఈ ప్ర‌యాణంలో కావాల్స‌ని అన్ని సౌక‌ర్యాల‌ను ఈ స్పేస్ షిప్‌లో ఉంచ‌బోతున్నారు.  

Read: మహేష్, పవన్ కాంబినేషన్ సెట్ అవుతోందా ?

ఈ భారీ షిప్ ను స్టెయిన్‌లెస్ స్టీల్‌తో త‌యారు చేస్తున్నారు.  ఆ ప్ర‌యోగాల‌కు కావాల్సిన అన్ని అనుమ‌తులు చెక‌చెక జ‌రిగిపోతున్నాయి.  వివిధ ద‌శ‌ల్లో ఈ స్టార్‌షిప్‌లో 28 రాప్టాన్ ఇంజ‌న్ల‌ను వినియోగిస్తారు.  స్టార్‌షిప్‌లో మొత్తం 40 కేబిన్లు ఉండేలా నిర్మిస్తున్నారు.  ఒక్కోకేబిన్‌లో గ‌రిష్టంగా 6 మంది వ‌ర‌కు ఉండోచ్చు.  అయితే, తొలుత ఒక్కో కేబిన్ కేవ‌లం ఇద్ద‌రు మాత్ర‌మే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇక అరుణ‌గ్ర‌హంపై ల్యాండిగ్ విష‌యంలో చాలా జాగ్ర‌త్తులు తీసుకోబోతున్న‌ట్టు స్పేస్ ఎక్స్ తెలియ‌జేసింది.  60 డిగ్రిల కోణంలో రాకెట్‌ను ల్యాండిగ్ చేస్తామ‌ని, ఆ స‌య‌మంలో బూస్ట‌ర్స్ ను మండించి రాకెట్‌ను హారిజంట‌ల్‌గా ల్యాండింగ్ చేస్తామ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  ప్ర‌స్తుతం ప్రోటోటైప్ ప్ర‌యోగాలు చేస్తున్నారు.  భూమికి ఏదైనా ప్ర‌మాదం జ‌రిగి మాన‌వాళికి ఇబ్బందులు ఎదురైతే ఇత‌ర గ్ర‌హాల్లో మ‌నిషి త‌న నాగ‌రిక‌త‌ను ప్రారంభించేందుకు వీలుగా ఈ ప్ర‌యోగాలు జ‌రుగుతున్నాయి. అరుణ‌గ్ర‌హంలో కాల‌నీలు ఏర్పాటు చేయాల‌ని ఎల‌న్ మ‌స్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ప్ర‌య‌త్నారు చేస్తున్న‌ది. 

Exit mobile version