NTV Telugu Site icon

విస్కీ వ్య‌ర్ధాల‌తో బ‌యోగ్యాస్‌…

ప్ర‌పంచంలో కాలుష్యాన్ని త‌గ్గించేందుకు ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  ఇందులో భాగంగా బ‌యోగ్యాస్ వంటివి విరివిగా వాడుక‌లోకి వ‌స్తున్నాయి.  ప‌రిశ్ర‌మ‌ల్లో వినియోగించిన వ్య‌ర్ధాల‌తో బ‌యోడీజిల్‌, బ‌యోగ్యాస్‌ల‌ను త‌యారుచేస్తున్నారు.  అయితే, ఇప్పుడు ప్ర‌ఖ్యాతిగాంచిన విస్కీ త‌యారీ సంస్థ గ్లెన్ ఫెడిచ్ వ్య‌ర్ధాల‌తో బ‌యోగ్యాస్‌ను త‌యారు చేస్తున్న‌ది.  అలా త‌యారు చేసిన బ‌యోగ్యాస్‌తో ట్ర‌క్కుల‌ను న‌డుపుతున్న‌ది. మాములు ఇంధ‌నాల వాడ‌కం వ‌ల‌న వ‌చ్చిన క‌ర్భ‌న ప‌దార్ధాల కంటే ఈ వ్య‌ర్ధాల‌తో త‌యారుచేసిన బ‌యోగ్యాస్‌తో విడుద‌ల‌య్యే వ్య‌ర్ధాలు 95 శాతం మేర త‌క్కువ‌గా ఉంటాయ‌ని సంస్థ స్ప‌ష్టం చేసింది.  

Read: ‘కె.జి.ఎఫ్‌. -2’ ఆలస్యానికి అదే కారణమా!?

దీనికోసం స్కాట్‌లాండ్‌లోని డ‌ఫ్‌టౌన్ డిస్ట‌ల‌రీలో బ‌యోగ్యాస్ ఫ్యూయ‌ల్ స్టేష‌న్‌ను ఏర్పాటు చేసింది. గ్లెన్‌ఫెడిచ్ సంస్థ‌కు చెందిన 5 ట్ర‌క్కుల‌కు ఈ బ‌యోగ్యాస్‌ను వినియోగిస్తున్నారు. మ‌రో 20 ట్ర‌క్కుల‌ను కూడా బ‌యోగ్యాస్ కు అనుకూలంగా మార్పులు చేస్తున్న‌ట్టు ఆ సంస్థ తెలిపింది.  ప్ర‌తిఏటా ఈ కంపెనీ కొటీ 40 ల‌క్ష‌ల విస్కీబాటిళ్ల‌ను త‌యారు చేసి అమ్ముతుంది. దీని ద్వారా వ‌చ్చే వ్య‌ర్ధాల‌తో ఇప్పుడు బ‌యోగ్యాస్‌ను రూపొందిస్తూ ప‌ర్యావ‌ర‌ణానికి కొంత మేలు చేస్తున్న‌ది.