WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్‌లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పులు
- నిందితుడిని పట్టుకున్న భద్రతా దళాలు
- నిందితుడి హిట్ లిస్ట్‌లో ట్రంప్, అధికారుల పేర్లు
- కాష్ పటేల్ పేరు మినహాయించిన నిందితుడు
- దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో దుండగుడి జరిపిన కాల్పులు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. అధ్యక్షుడు ట్రంప్‌తో సహా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇక నిందితుడు కోల్ థామస్ అలెన్ కాల్పులకు ముందు తన లక్ష్యాన్ని ముందుగానే కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. దర్యాప్తులో ఈ విషయాలు బయటపడ్డాయి. అయితే ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ మినహా ట్రంప్‌తో సహా ఉన్నతాధికారులు తన టార్గెట్‌గా తెలియజేశాడు. అయితే కాష్ పటేల్‌ను ఎందుకు మినహాయించాడన్న దానిపై సర్వత్రా చర్చ నడిచింది.

Also Read
- Israel vs Hamas: అక్టోబర్ 7 రహస్యం! ఆ 10 రోజుల్లో ఏం జరిగింది?
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
తాజాగా దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాష్ పటేల్‌ను నిందితుడు ఎందుకు మినహాయించాడన్న దానిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి దర్యాప్తు చేపట్టారు. ది న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. నిందితుడికి క్రైస్తవ వ్యతిరేక భావాలు ఉన్నాయని గుర్తించారు. కాష్ పటేల్ హిందువు కాబట్టి అతన్ని హిట్ లిస్ట్ నుంచి తప్పించినట్లుగా తెలుస్తోంది.
ఇక విచారణలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. నిందితుడు తన మానిఫెస్టోలో ‘‘రూల్స్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్’’ అని రాసున్నట్లుగా తెలుస్తోంది. అందులో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను లక్ష్యంగా చేయకూడదని పేర్కొన్నట్లు సమాచారం. కాష్ పటేల్ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ఉండటంతో.. ఈ కారణంగా ఆయనను మినహాయించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక మానిఫెస్టోలో తీవ్ర రాజకీయ కోణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ ఘటన వెనుక ఉన్న అసలు ఉద్దేశాలు, ప్రభావాలు ఏంటన్నదిపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి మానసిక స్థితి, భావజాలం, సంబంధిత వ్యక్తులపై కూడా విచారణ కొనసాగుతోంది.
నిందితుడి మేనిఫెస్టో ఇదే..
నిందితుడు ‘‘కోల్.’’ ‘‘కోల్డ్‌ఫోర్స్’’, ‘‘ఫ్రెండ్లీ ఫెడరల్ అసాసిన్’’ పేరుతో తన మేనిఫెస్టో లక్ష్యాన్ని రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. ఈ టార్గెట్‌లో అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేశాడు. అధ్యక్షుడితో పాటు ఉన్నతాధికారులే తన లక్ష్యమని కుటుంబ సభ్యులకు ముందుగానే సమాచారం అందించాడు. సాధ్యమైనంత మట్టుకు ప్రాణ నష్టం తక్కువగా జరగాలని.. అవసరమైతేనే తప్ప సీక్రెట్ సర్వీస్‌పై దాడి చేస్తానని.. లేదంటే చేయబోనని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
-
Sabita Indra Reddy: చీర లాగారు.. కింద పడేసి తొక్కారు.. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాం..
-
CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Parliament Session 2026: 2015 రికార్డు బ్రేక్.. పార్లమెంట్ సమావేశాల ముగింపులో జాప్యంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!