WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్ నుంచి అతనొక్కడే మినహాయింపు.. కారణమేంటో..! సర్వత్రా చర్చ
- వాషింగ్టన్ కాల్పులపై కొనసాగుతున్న విచారణ
- హిట్ లిస్ట్‌ను కుటుంబ సభ్యులకు ముందే పంపిన నిందితుడు
- టార్గెట్‌లో స్పష్టంగా వివరాలు
- ఒక్కడిని మాత్రమే మినహాయించిన నిందితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని ట్రంప్ ఇచ్చిన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా జరిగిన కాల్పులు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. హిల్టన్ హోటల్లో గ్రాండ్‌గా విందు జరుగుతుండగా 31 ఏళ్ల కోల్ థామాస్ అలెన్ తుపాకులతో విరుచుకుపడ్డాడు. ఈ ఘటనతో విందు ఒక్కసారిగా గందరగోళానికి గురైంది. అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను భద్రతా సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇక వెంటనే నిందితుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర నుంచి షాట్‌గన్, హ్యాండ్‌గన్, పలు కత్తులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే విచారణలో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాల్పులకు ముందు నిందితుడు కోల్ థామాస్ అలెన్ తన టార్గెట్‌కు సంబంధించిన విషయాలను ముందుగానే కుటుంబ సభ్యులకు పంపించాడు. ట్రంప్ పరిపాలనలో ఉన్న ఉన్నతాధికారులే తన లక్ష్యమని కుటుంబ సభ్యులకు సందేశం పంపించాడు. ఇందులో ఆశ్చర్యమేంటంటే.. అమెరికాలో అత్యున్నత పదవిలో ఉన్న ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్‌ను మాత్రం తప్పించాడు. కాష్ పటేల్ మినహా మిగతా అధికారులంతా తన లక్ష్యమని నిందితుడు కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లుగా అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ‘‘ది న్యూయార్క్ పోస్ట్’’ తన నివేదికలో పేర్కొంది. అయితే ఇప్పుడు కాష్ పటేల్‌ను ఎందుకు మినహాయించాడన్న దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది.
Also Read
- Donald Trump: ట్రంప్‌పై అత్యాచార ఆరోపణలు.. మాజీ మిస్ స్విట్జర్లాండ్ సంచలన వ్యాఖ్యలు!
- Israel Elections: ఇజ్రాయెల్‌లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. నెతన్యాహు పీఠానికి ముప్పు?
- దొంగచాటుగా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన Anthropic Claude AI.. ప్రభుత్వ డేటాబేస్‌ల భద్రతపై కొత్త ప్రశ్నలు..
- China: సినిమా హీరోలా? సైన్స్ వీరులా? ప్రపంచానికి కళ్లు తెరిపించిన చైనా
ఇక నిందితుడు ‘‘కోల్.’’ ‘‘కోల్డ్ఫోర్స్’’, ‘‘ఫ్రెండ్లీ ఫెడరల్ అసాసిన్’’ పేరుతో తన మేనిఫెస్టో లక్ష్యాన్ని రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. ఈ టార్గెట్‌లో అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేశాడు. అధ్యక్షుడితో పాటు ఉన్నతాధికారులే తన లక్ష్యమని కుటుంబ సభ్యులకు ముందుగానే సమాచారం అందించాడు. సాధ్యమైనంత మట్టుకు ప్రాణ నష్టం తక్కువగా జరగాలని.. అవసరమైతేనే తప్ప సీక్రెట్ సర్వీస్‌పై దాడి చేస్తానని.. లేదంటే చేయబోనని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఇక కాల్పుల తర్వాత కాష్ పటేల్‌ను అక్కడ నుంచి భద్రతా సిబ్బంది తీసుకెళ్లిపోయారు. అనంతరం వైట్‌హౌస్‌లో జరిగిన ప్రెస్ బ్రీఫింగ్లో పాల్గొన్నారు.

ఇక నిందితుడు కాలిఫోర్నియా నుంచి రైలులో వాషింగ్టన్కు వచ్చినట్లుగా గుర్తించారు. అతడు మంచి విద్యావంతుడు. ఇంజనీరింగ్ నేపథ్యం ఉండి.. టీచర్‌గా గేమ్ డెవలప్గా కూడా పని చేసినట్లుగా కనిపెట్టారు. అయితే ఇటీవల ఇతగాడి ప్రవర్తనలో మార్పులు వచ్చాయని.. సమాజ సమస్యలపై చర్యలు తీసుకోవాలని మాట్లాడేవాడని కుటుంబ సభ్యులు విచారణలో వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడిపై ఎఫ్‌బీఐ, యూఎస్ సీక్రెట్ సర్వీస్ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. నిందితుడిపై ఆయుధాలతో దాడి యత్నం, ఫెడరల్ అధికారిపై దాడి కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Postal Ballot Rules 2026: పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై కొత్త నిబంధనలు.. APSEC కీలక నిర్ణయం..
-
TPCC Mahesh Goud : కేటీఆర్, హరీష్ భ్రమల్లో ఉన్నారు.. కాంగ్రెస్ టార్గెట్ 100
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Tollywood : వైలెన్స్ వద్దు ఫ్యామిలీ సినిమాలే ముద్దు
-
AP Local Body Elections: ఎన్నికలకు వెళ్లండి.. ఆల్ ది బెస్ట్.. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!