Mars: ఈ అనంత విశ్వంలో భూమిని పోలిన గ్రహాలు, జీవరాశులపై ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మన సౌరకుటుంబంలోని అంగారక గ్రహం శాస్త్రవేత్తలను ఆకర్షిస్తోంది. 3 బిలియన్ సంవత్సరాల క్రితం అంగారకుడు కూడా భూమి లాగే సముద్రాలు, సరస్సులు, నదులతో నిండి ఉండేదని చాలా పరిశోధనల తర్వాత శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. ఈ గ్రహంపై జీవం ఆనవాళ్లకు సంబంధించిన పరిశోధనల కోసం నాసాతో పాటు పలు దేశాల అంతరిక్ష సంస్థలు రోవర్లను, శాటిలైట్లను పంపాయి. నాసా క్యూరియాసిటీ, ఆపర్చునిటీ, పర్సువరెన్స్ రోవర్లను ఆ గ్రహం పైకి పంపాయి. జీవానికి సంబంధించిన ఆనవాళ్ల కోసం వెతుకుతున్నాయి.
Read Also: Waqf Bill: “వక్ఫ్ బిల్లు”పై పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్‌గా జగదాంబికా పాల్ నియామకం..
ఇదిలా ఉంటే, నాసాకి చెందిన మార్స్ ఇన్‌సైట్ ల్యాండర్ డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు కీలక విషయాన్ని వెల్లడించారు. అంగారకుడి ఉపరితలం దిగువన ద్రవ నీరు ఉన్నట్లు చెప్పారు. 2018 నుంచి ల్యాండర్ ఆ గ్రహంపై వచ్చే భూకంపాలను పరిశీలిస్తోంది. ఉపరితలం కింద ఏ పదార్థాలు ఉన్నాయనే వివరాలను ఇది పరిశోధిస్తోంది. ల్యాండర్ డేటా ఆధారంగా మార్స్ దిగువన నీరు చాలా మొత్తం పరిమాణంలో ఉన్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. ఉపరితలం కింద 11.5 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల మధ్య పగుళ్లలో ద్రవపు నీటి పెద్ద రిజర్వాయర్లు ఉన్నట్లు అధ్యయనం కనుగొంది.
భూమిపై మనకు తెలిసిన విషయం ఏంటంటే, తడి ఉన్న చోట సూక్ష్మజీవులకు అనువుగా ఉంటుంది అని రచయితల్లో ఒకరైన కాలిఫోర్నియాకు చెందిన శాన్ డియాగో స్క్రిప్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన వాషన్ రైట్ అన్నారు. భూమిపై భూగర్భ జలాలు ఉపరితలం నుంచి లోనికి వెళ్లినట్లే, అంగారకుడిపై జరగొచ్చని అతను చెప్పారు. అంగారకుడి ఉపరితలం కింద లోతుగా ఉన్న నీటిని అధ్యయనం చేయడానికి మార్గం లేదని, మార్స్ నీటి చక్రాన్ని అర్థం చేసుకోవడానికి, గత ఉపరితల నీటి యొక్క విధుల్ని నిర్ణయించడానికి, గతంలో ఉనికిలో ఉన్న జీవితాన్ని శోధించడాని, అంచనా వేయడానికి చిక్కులు ఉన్నాయని పరిశోధకులు చెప్పారు. స్క్రిప్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన మాథియాస్ మోర్జ్‌ఫెల్డ్ మరియు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీకి చెందిన మైఖేల్ మాంగా ఈ అధ్యయనం, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క ప్రొసీడింగ్స్ జర్నల్‌లో ఆగస్టు 12న ప్రచురించబడింది.