NTV Telugu Site icon

Putin: రష్యా ప్రజలకు దేశాధ్యక్షుడు పుతిన్ కీలక పిలుపు

Putin

Putin

రష్యాలో జనాభా తగ్గుదలపై దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన దేశ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. పని విరామ సమయంలో రష్యన్లు సెక్స్ చేయాలని కోరారు. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాలో జనాభా తగ్గిపోతుందని వ్యాఖ్యానించారు. సంతానోత్పత్తి కోసం లంచ్ మరియు కాఫీ బ్రేక్‌లను ఉపయోగించాలని ఆరోగ్య మంత్రి నొక్కి చెప్పారు. రష్యా యొక్క ప్రస్తుత సంతానోత్పత్తి రేటు ప్రతి స్త్రీకి సుమారుగా 1.5 మంది పిల్లలను కలిగి ఉంది. ఇది జనాభా స్థిరత్వానికి అవసరమైన 2.1 కంటే తక్కువగా ఉందని అభిప్రాయపడింది.

ఇది కూడా చదవండి: Delhi: మంగళవారం ప్రధాని మోడీ గిఫ్ట్‌లు వేలం.. విలువ ఎంతంటే..!

ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధం కారణంగా దేశ జనాభా తగ్గుముఖం పట్టింది. దీని వల్ల దాదాపు మిలియన్ల మంది యువకులు, రష్యన్లు వలసవెళ్లారు. ఈ నేపథ్యంలో సంతానోత్పత్తికి పని అడ్డంకి కాకూడదని రష్యా ఆరోగ్య మంత్రి డాక్టర్ యెవ్జెనీ షెస్టోపలోవ్ ఉద్ఘాటించారు. కుటుంబ విస్తరణ కోసం రష్యన్లు భోజనం మరియు కాఫీ విరామాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇది కూడా చదవండి: Jani Master Wife: జానీ మాస్టర్ భార్య కూడా.. మరో షాకింగ్ విషయం వెలుగులోకి!

ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం.. రష్యా 2024 మొదటి అర్ధ భాగంలో 25 సంవత్సరాలలో అతి తక్కువ జనన రేటును నమోదు చేసింది. జూన్‌లో జననాలు మొదటిసారిగా లక్ష కంటే తక్కువకు పడిపోయాయని, ఇది గణనీయమైన తగ్గుదలని సూచిస్తుందని గణాంకాలు వెల్లడించాయి. జనవరి మరియు జూన్ 2024 మధ్య రష్యాలో మొత్తం 5,99,600 మంది పిల్లలు జన్మించారు. ఇది 2023లో ఇదే కాలంలో కంటే 16,000 తక్కువ.

ఇది కూడా చదవండి: ICC: ఆధిపత్యం చెలాయించిన ఆ దేశ ఆటగాళ్లు.. బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు వారికే

Show comments