Site icon NTV Telugu

కెన‌డాలో దారుణంః ఆ పాఠశాల‌లో బ‌య‌ట‌ప‌డ్డ 600 అస్తిపంజ‌రాలు…

కెన‌డాలో చిన్నారుల అస్తిపంజ‌రాలు భ‌య‌పెడుతున్నాయి.  గ‌త నెల‌లో కెన‌డాలోని బ్రిటీష్ కొలంబియాలోని మూసిఉన్న పాఠ‌శాల‌లో దాదాపుగా 200ల‌కు పైగా అస్తిపంజ‌రాలు బ‌య‌ట‌ప‌డ‌గా, తాజాగా వాంకోవ‌ర్‌లోని మూసిఉన్న ఓ పాఠ‌శాల‌లో 600ల‌కు పైగా అస్తిపంజ‌రాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.  దీంతో కెన‌డా ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది.  ప్ర‌త్యేక రాడార్ వ్వ‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసి మూసిఉన్న పాఠ‌శాల‌లో సెర్చ్ చేస్తున్నారు.  గ‌త‌నెల‌లో ప్ర‌ఖ్యాత కామ్‌లూన్స్ ఇండియ‌న్ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌లో 215 అస్తిపంజరాలు బ‌య‌ట‌ప‌డటంతో ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయింది.

Read: ప్రకాష్ రాజ్ కి చిరంజీవి ఆశీస్సులు… నాగబాబు కామెంట్స్

 ఇప్పుడు తాజాగా వాంకోవ‌ర్‌లోని మారివ‌ల్ ఇండియ‌న్ రెసిడెన్షియ‌ల్ స్కూల్లో సెర్చ్ చేయ‌గా 600ల‌కు పైగా స‌మాధులు బ‌య‌ట‌ప‌డ్డాయి.  వ‌ర‌స‌గా మూసిఉన్న పాఠ‌శాల‌ల్లో ఇలా అస్తిపంజ‌రాలు బ‌య‌ట‌ప‌డుతుండ‌టంతో ఆ దేశ ప్ర‌ధాని దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు.  అన్ని చోట్ల సెర్చ్ చెయిస్తామ‌ని తెలిపారు.  1899 నుంచి 1997 మ‌ధ్య‌వ‌ర‌కు ఈ స్కూళ్లు రోమ‌న్ క్యాథ‌లిక్ చ‌ర్చి ఆధ్వ‌ర్యంలో న‌డిచింది. ఆ స‌మ‌యంలోనే ఈ మార‌ణ‌కాండ‌లు జ‌రిగి ఉంటాయ‌ని అధికారులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.  

Exit mobile version