Site icon NTV Telugu

డెల్టా వేరియంట్‌పై వ్యాక్సిన్ల ప్ర‌భావం…

క‌రోనా వ్యాక్సిన్‌ను వేగంగా అమ‌లు చేస్తున్నారు.  మొద‌టి వేవ్ చివ‌రి ద‌శ‌లో ఉండ‌గా వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌చ్చాయి.  అయితే, అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత‌, ఈ వ్యాక్సిన్ల‌ను అర్హులైన అంద‌రికీ ఇవ్వ‌డం ప్రారంభించారు.  అయితే, సెకండ్ వేవ్ కు కార‌ణ‌మైన డెల్టా వేరియంట్‌లపై ఈ అస్త్రాజన‌కా, ఫైజ‌ర్ టీకాలు ఎంత‌వ‌ర‌కు ప‌నిచేస్తున్నాయి అనే అంశంపై ఆక్స్‌ఫ‌ర్డ్ విశ్వవిద్యాల‌యం ప‌రిశోధ‌న‌లు చేసింది.  డెల్టా, క‌ప్పా వేరియంట్‌ల‌పై వ్యాక్సిన్లు స‌మ‌ర్ద‌వంతంగా పనిచేస్తున్నాయ‌ని, అయితే, శ‌రీరంలో యాంటీబాడీలు త‌గ్గిపోతున్న‌ట్టు గ‌మ‌నించిన ప‌రిశోధ‌కులు ఇవి రీ ఇన్‌ఫెక్ష‌న్ల‌కు కార‌ణం అవుతున్నాయ‌ని, వీటీపై మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు చేయాల్సి ఉంద‌ని చెబుతున్నారు.  

Read: బీజేపీకి భయపడే కేసీఆర్ బయటకు వస్తున్నారు…

ఇక ఇండియాలో సెకండ్ వేవ్‌కు కార‌ణ‌మైన డెల్టా వేరియంట్‌ను అందుబాటులో ఉన్న కోవీషీల్డ్, కొవాగ్జిన్‌, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు స‌మ‌ర్ధ‌వంతంగా ప‌నిచేస్తున్నాయ‌ని ఇప్ప‌టికు ఇండియా తెలిపింది.  అయితే, రీసెంట్‌గా ఇండియాలో డెల్టా ప్ల‌స్ వేరియంట్లు బ‌య‌ట‌పడుతుండ‌టంతో, ఇవి ఏ మేర‌కు ప‌నిచేస్తాయి అన్న‌ది తెలియాల్సి ఉన్న‌ది.  

Exit mobile version