US-Ukraine Peace Talks: వైట్ హౌజ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోడిమిర్ జెలెన్ స్కీల మధ్య వాగ్వాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంమైంది. అయితే, ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత సౌదీ అరేబియా వేదికగా అమెరికా-ఉక్రెయిన్ శాంతి చర్చల్ని ప్రారంభించాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం ఇరు దేశాల నేతలు కూడా జెడ్డా వేదికగా చర్చించనున్నారు.
Read Also: Balochistan: బలూచిస్తాన్ స్వాతంత్రం తప్పదా?.. పట్టుకోల్పోతున్న పాకిస్తాన్.. అసలేంటి ఈ వివాదం..
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో నేతృత్వంలోని అమెరికా అధికారులు, ఉక్రెయిన్ అధ్యక్ష్ కార్యాలయ అధిపతి ఆండ్రి యెర్మాక్ నేతృత్వంలోని ఉక్రెయిన్ అధికారులు తమ చర్చల్ని ప్రారంభించారు. మాస్కోపై ఉక్రెయిన్ అతిపెద్ద డ్రోన్ దాడుల తర్వాత అమెరికా-ఉక్రెయిన్ శాంతి చర్చలు ప్రారంభం కావడం గమనార్హం. అమెరికాతో సమావేశం నిర్ణయాత్మకంగా ప్రారంభమైంది, మేము మా పనిని కొనసాగిస్తున్నాము అని యెర్మాక్ మీడియాతో అన్నారు. ఉక్రెయిన్ శాంతిని కోరుకుంటోందని, యుద్ధాన్ని ముగించడానికి సిద్ధంగా ఉందని ఆమె అన్నారు.