US-Russia Energy Deal: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా- రష్యా అధికారులు శాంతి చర్చల వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మాస్కో- న్యూయార్క్ మధ్య ఎనర్జీ ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఈ ఒప్పందాలు అమెరికా నుంచి రష్యాకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించే విధంగా ఉన్నాయి. అయితే, పరిమితులకు లోబడి ఉన్న రష్యా, Arctic LNG 2 సహా తన ఎల్ఎన్జీ ప్రాజెక్టుల కోసం అమెరికా పరికరాలను కొనుగోలు చేసే అంశంపై చర్చలు జరుపుతుండగా.. దీనికి ప్రత్యామ్నాయంగా, రష్యా నుంచి న్యూక్లియర్ శక్తితో నడిచే ఐస్‌బ్రేకర్లు కొనుగోలు చేయాలని అమెరికా ప్రతిపాదించినట్లు సమాచారం.
Read Also: Storyboard: ఓట్ల చోరీ ఆరోపణలు పనిచేస్తాయా..? బీజేపీ సత్తా చాటుతుందా..?
మాస్కోలో యూఎస్-రష్యా చర్చలు
ఇటీవల మాస్కో పర్యటనలో ఉన్న అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తో పాటు ఆ దేశ విదేశీ పెట్టుబడుల ప్రతినిధి కిరిల్ దిమిత్రివ్లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశాల్లో పలు ఎనర్జీ ఒప్పందాలు, పెట్టుబడి అంశాలు చర్చకు వచ్చాయని రాయిటర్స్ వెల్లడించింది. అలాగే, అలాస్కా సమ్మిట్ తర్వాత భారీ పెట్టుబడి ఒప్పందం కుదిరిందని శీర్షికలు రావాలని వైట్ హౌస్ కోరుకుంది.. ట్రంప్ గొప్ప ఘనత సాధించాడు అనే విధంగా హెడ్ లైన్స్ ఉండాలని కోరుకోవడం అతడి శాడిజానికి నిదర్శనం అని మరో వర్గం రాయిటర్స్‌కు తెలిపింది.
Read Also: Gold Rates: పసిడి పరుగులు.. భారీగా పెరిగిన ధరలు.. నేడు తులం ఎంతంటే?
భారత్‌పై 50 శాతం సుంకం.. ట్రంప్ ద్వంద్వ వైఖరి..
ఇదిలా ఉంటే, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ- రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు చేసుకోవడం వల్ల అదనంగా 25% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సుంకాలు నేటి నుంచి అమల్లోకి రావడంతో, భారత దిగుమతులపై మొత్తం సుంకం 50 శాతానికి చేరుకుంది. ఒకవైపు రష్యాతో ఒప్పందాలు చేస్తూ, మరోవైపు భారత్‌పై కఠిన చర్యలు తీసుకోవడం అతడి ద్వంద్వ వైఖరికి నిదర్శనమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
