ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది.. 50 రోజులు గడిచినా యుద్ధం ఆగడం లేదు.. ఇక, రష్యా బలగాలకు ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది.. తాజా దాడుల్లో కీవ్, ఖెర్సన్, ఖార్కివ్ మరియు ఇవానో-ఫ్రాన్కివ్స్క్ లాంటి నగరాల్లో భారీ నష్టం జరిగినట్టు చెబుతున్నారు.. మరోవైపు.. ఉక్రెయిన్‌ను మేం ఉన్నామంటూ ప్రకటిస్తూ వస్తున్న అమెరికా.. ఆ దేశానికి భారీ సాయం చేసింది.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌కు మరో 80కోట్ల డాలర్ల సైనిక సాయాన్ని ప్రకటించారు.
Read Also: Mutyala Naidu: రాష్ట్రానికి, సీఎంకి మంచి పేరు తీసుకొస్తా..
రష్యాను దీటుగా ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు యుద్ధ శకటాలు, తీర ప్రాంత రక్షణలో నౌకల్లో నుండి ప్రయోగించగల డ్రోన్‌లు, రసాయన, జీవాయుధ, అణు, రేడియాలజీ దాడుల్లో సైనికులకు రక్షణగా ఉపయోగించే గేర్, ఇతర పరికరాలను ఈ సాయంలో భాగంగా ఉక్రెయిన్‌కు అందజేయనుంది అగ్రరాజ్యం అమెరికా.. అత్యంత సమర్ధవంతమైన ఆయుధ వ్యవస్థలు, రష్యా కొత్తగా ఆరంభించే విస్తృత దాడులకు అవసరమైనంత కొత్త సామర్ధ్యాలు అన్నీ ఇందులో వుంటాయని తన ప్రకటనలో పేర్కొన్నారు యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్.. ఇక, ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ విఫలమయ్యారని, ఈ తరుణంలో మనం విశ్రాంతిగా వుండలేమన్నారు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాట్లాడిన బైడెన్.. ఆ తర్వాత సాయాన్ని ప్రకటించారు.