NTV Telugu Site icon

Death: మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది..? నర్స్ చెప్పిన విషయాలు వైరల్..

Death.

Death.

Death: ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఏం జరుగుతుందనే విషయాన్ని అమెరికాకు చెందిన ఒక నర్స్ షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె చెప్పిన వివరాలు వైరల్‌గా మారాయి. ఇంటెన్సివ్ కేర్(ఐసీయూ)లో చాలా అనుభవం కలిగిన ఆమె చెప్పిన వివరాలు సంచలనంగా మారాయి. నర్సు జూలీ మెక్‌ఫాడెన్ మరణం తర్వాత శరీరంలో సంభవించే మార్పులను తెలియజేసింది. యూట్యూబ్‌లో షేర్ చేసిన ఈ వీడియో 6 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ సంపాదించుకుంది.

శరీరం రిలాక్స్:

మరణం తర్వాత శరీరం ‘‘రిలాక్స్’’ అవుతుంది. మరణించిన వెంటనే శరీరం రిలాక్స్ మోడ్‌లోకి వెళ్తుంది. ఇది శరీరం ‘డీకంపోజిషన్’ మొదటి దశగా చెప్పింది. దీనిని హైపోస్టాసిస్ అని కూడా అంటారు. కొంత మందిలో మూత్ర విసర్ఝన, ప్రేగు కదలికలు ఉండొచ్చు. ముక్కు, కళ్లు, చెవుల నుంచి ద్రవాలు రావడం కూడా జరగొచ్చు. ముఖ్యంగా సాధారణంగా శరీర ద్రవాల కలిగి ఉన్న కండరాలు, ఇతర వ్యవస్థలు విశ్రాంతి తీసుకోవడంతో మరణం కొంచెం గందరగోళంగా ఉంటుందని అని చెప్పింది.

శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది:

నర్స్ జూలీ ప్రకారం.. ప్రతీ వ్యక్తి యోక్క శరీరం మరణం తర్వాత భిన్నంగా స్పందింస్తుంది. అల్గోర్ మోర్టిస్ అని పిలువబడే శీతలీకరణ ప్రక్రియ కొందరిలో వెంటనే ప్రారంభమవుతుంది. మరికొందరిలో ఇది ఒకటి లేదా రెండు గంటల వరకు ఆలస్యం కావచ్చు. సగటున శరీర ఉష్ణోగ్రత గంటకు 1.5 డిగ్రీలు పడిపోతుంది. చివరకు చుట్టుపక్కల ఉన్న వాతావరణ ఉష్ణోగ్రతతకు చేరుకుంటుంది. సాంకేతికంగా చెప్పాలంటే, శరీర ఉష్ణోగ్రత గంటకు ఒకటిన్నర డిగ్రీల ఫారెన్‌హీట్ తగ్గుతుంది, చివరికి వారు ఉన్న గదిలోని ఉష్ణోగ్రతతో సమానం అవుతుందని ఆమె చెప్పారు.

రక్తం కిందకు చేరుతుంది:

మరణం సంభవించిన తర్వాత చాలా మందికి తెలియని మరో విషయం జరుగుతుందని జూలీ చెప్పారు. చనిపోయిన తర్వాత శరీరంలోని రక్తం కిందకు చేరుతుంది. భూమి గురుత్వాకర్షణ వల్ల భూమి వైపు కదులడం ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియను లివర్ మోర్టిస్ అంటారు. చనిపోయిన వ్యక్తికి సంబంధించి అతడి కాళ్ల వెనక భాగం ఉదారంగు లేదా ముదురు రంగులో కనిపిస్తుంది. ఎందుకంటే వారి రక్తం కిందకు చేరడంతో ఇలా అవుతుంది.

శరీరం గట్టి పడుతుంది:

జీవక్రియ ప్రక్రియలు ఆగిపోవడంతో కండరాలు గట్టిపడుతాయి. రిగర్ మోర్టిస్ అనేది సాధారణంగా పోస్ట్ మార్టం తర్వాత 2-4 గంటల్లోపు ప్రారంభమవుతుంది. పర్యావరణ పరిస్థితులు, వ్యక్తిగత భౌతిక లక్షణాల వంటి వాటిపై ఆధారపడి 72 గంటల వరకు ఉంటుంది. మరణం తర్వాత శరీరం భారం పెరుగుతుందని చెప్పింది. వ్యక్తులు చనిపోయిన తర్వాత కొందరి శరీరం కొన్ని నిమిషాల్లోనే కఠినంగా మారడాన్ని తాను చూసినట్లు, మరికొందరిలో ఈ ప్రక్రియకు సమయం పట్టినట్లు చెప్పారు.

శరీరం చల్లగా మారిపోతుంది:

దాదాపు 12 గంటల పోస్ట్‌మార్టం తర్వాత, శరీరం యొక్క ఉష్ణోగ్రత నియంత్రణ ఆగిపోతుంది. అప్పుడు డెడ్ బాడీని ముట్టుకుంటే చల్లగా అనిపిస్తుంది. అడెనోసిన్ ట్రైఫాస్పెట్(ఏటీపీ) శక్తి ప్రక్రియ నిలిచిపోవడంతో జీవక్రియ ఆగిపోతుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది.

కుళ్లిపోయే ప్రక్రియ:

శరీరం చివరగా కుళ్లిపోయే ప్రక్రియకు వస్తుందని నర్స్ జూలీ చెప్పారు. ఈ దశలో శరీరం విచ్ఛిన్నమవుతుందని తెలిపారు. అయితే, చాలా సందర్భాల్లో ఇలాంటి ప్రక్రియకు ముందే అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించింది.

Show comments