Alaska Flying Object Blasted: 40 వేల అడుగుల ఎత్తులో అలస్కా మీదుగా సంచరిస్తున్న ఓ గుర్తు తెలియని వస్తువును గుర్తించిన అమెరికా అధికారులు.. ఓ ఫైటర్ జెట్ సహకారంతో శుక్రవారం కూల్చివేశారు. దీనిపై వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ.. ఆ వస్తువు ఉద్దేశం ఏంటో ఇంకా స్పష్టంగా తెలియరాలేదన్నారు. అయితే అది 40 వేల అడుగుల ఎత్తులో తేలుతూ, పౌర విమానయానానికి ముప్పుగా ఉన్నందున దాన్ని కూల్చివేసినట్లు చెప్పారు. తమ దేశ అధ్యక్షుడి జో బైడెన్ ఆదేశాల మేరకు తాము దాన్ని ధ్వంసం చేశామని వెల్లడించారు.
Kishan reddy: బంగారు తెలంగాణ అన్నారు.. కుటుంబాన్ని బంగారం చేసుకున్నారు
ఆరు రోజుల క్రితం తాము ధ్వంసం చేసిన ‘చైనా గూఢచారి బెలూన్’ కంటే ఈ వస్తువు చాలా చిన్నదిగా ఉందని, ఒక చిన్న కారు పరిమాణంలో ఉండొచ్చని జాన్ కిర్బీ స్పష్టం చేశారు. ఈ వస్తువు ప్రభుత్వ యాజమాన్యం లేదా కార్పొరేట్ యాజమాన్యంలో ఉందో తమకు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని వివరించారు. అసలు ఆ వస్తువు ఉద్దేశం ఏంటో క్లారిటీ లేదని తెలిపారు. ఇదే సమయంలో పెంటగాన్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ పాట్ రైడర్ మాట్లాడుతూ.. F-22 రాప్టర్ ఆ వస్తువును పడగొట్టడానికి AIM-9X క్షిపణిని ఉపయోగించిందన్నారు. ఇంతకుముందు చైనా స్పై బెలూన్‌ని నాశనం చేసేందుకు ఏదైతే ఎయిర్‌క్రాఫ్ట్, మందుగండు సామాగ్రిని వినియోగించారో.. దాంతోనే ఈ కారు పరిమాణంలో ఉన్న వస్తువుని పేల్చేయడం జరిగిందన్నారు.
Woman Falls Under Train: రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించింది.. కానీ ఇంతలోనే..
గురువారం సాయంత్రం తాము ఈ కొత్త వస్తువు అలస్కా మీదుగా 40 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విషయాన్ని కనుగొన్నామని.. దీంతో ఆలస్యం చేయకుండా శుక్రవారం దాన్ని పేల్చేయడం జరిగిందని జాన్ కిర్బీ వెల్లడించారు. ఆ వస్తువు శిథిలాలు కెనడియన్ సరిహద్దుకు సమీపంలోని ఉత్తర అలస్కాలో ఘనీభవించిన నీటి ప్రాంతంలో పడ్డాయని, వాటిని కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశామని తెలియజేశారు. ఆ వస్తువుని కూల్చడానికి ముందు, దాన్ని పరిశీలించేందుకు ఒక మిలటరీ విమానాన్ని పంపించామన్నారు. అందులో మనుషులు ఎవ్వరూ లేరని పైలట్ సమాచారం అందించడంతో.. తమకు అనుమానం వచ్చిందని, దాంతో ఆ వస్తువునికూల్చేశామని జాన్ కిర్బీ తెలియజేశారు.
England Bomb Explode: వరల్డ్ వార్ 2 నాటి బాంబ్.. డిఫ్యూజ్ చేస్తుండగా భారీ పేలుడు
కాగా.. ఇటీవల తమ గగనతలంలోకి వచ్చిన ఓ భారీ చైనా నిఘా బెలూన్‌ను అమెరికా కూల్చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వారం రోజుల్లోపే గగనతలంలో మరో అనుమానాస్పద వస్తువు కన్పించడం తీవ్ర కలకలం రేపుతోంది. మరోవైపు.. కూల్చివేసిన చైనా బెలూన్ శకలాల నుంచి తాము అత్యంత కీలక సమాచారాన్ని సేకరించినట్లు పాట్రిక్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఆ బెలూన్‌లో కమ్యూనికేషన్ సంకేతాలను సేకరించగలిగే పరికరాలు ఉన్నాయన్నారు. ఈ బెలూన్ ఘటన కారణంగా.. అమెరికా, చైనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు రాజుకున్నాయి.