Site icon NTV Telugu

USA: అమెరికా యుద్ధానికి ప్లాన్ చేస్తోందా..? 800 మంది సైనిక అధికారులతో సీక్రెట్ మీటింగ్..

Usa

Usa

USA: అమెరికా ఏదైనా యుద్ధానికి ప్లాన్ చేస్తోందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ వచ్చే వారం ఉత్తర వర్జీనాయాలోని ఒక సైనిక స్థావరంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జనరల్స్, అడ్మిరల్స్ సహా అనేక మంది రక్షణ అధికారులు ఒకే చోట సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. వన్ స్టార్ లేదా అంతకన్నా ఎక్కువ సీనియర్ కమాండర్లు, వారి సీనియర్ సలహాదారులు వచ్చే మంగళవారం క్వాంటికోలోని మెరైన్ కార్ప్స్ స్థావరంలో ఒక ప్లాన్ గురించి చర్చనున్నట్లు తెలుస్తోంది. అమెరికా సైన్యంలో వివిధ హోదాల్లో అడ్మినర్స్, జనరల్స్ 800 మంది ఉన్నారు.

Read Also: IND vs PAK Final: ఫైనల్ కోసం భారత్‌ ప్రత్యేక హ్యూహం.. ఇంతకీ ఏంటబ్బా!

ఇంత పెద్ద సైనిక సమావేశం అమెరికాలో చర్చకు దారితీసింది. చాలా నివేదికల ప్రకారం, వెనుజులాపై అమెరికా సైనిక చర్య తీసుకోబోతోందని చెబుతున్నాయి. హెగ్సేత్ తన సీనియర్ ఆఫీసర్లను వాషింగ్టన్ కు తక్కువ సమయంలో రావాలని కోరడం, సమావేశ ఉద్దేశ్యం గురించి వారికి తెలియజేయకపోవడం, ఇవన్నీ సైన్యంలో, కాపిటల్ హిల్ లో ఆందోళనల్ని సృష్టించాయి.

Exit mobile version