US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
- ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం..
- 42 విమానాలు కోల్పోయినట్లు నివేదిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: అమెరికా-ఇరాన్ యుద్ధం ఇంకా ముగియలేదు. ఇప్పటికీ రెండు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరోవైపు, యూఎస్-ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు యుద్ధంలో ఎంత నష్టం సంభవించిందో అమెరికా అధికారికంగా బయటపెట్టలేదు. కానీ కొన్ని నివేదికల ప్రకారం, ఈ యుద్ధంలో అమెరికా తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (CRS) చెబుతున్న దాని ప్రకారం.. అమెరికాకు భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
యుద్ధంలో ఫైటర్ జెట్లు, డ్రోన్లతో సహా కనీసం 42 అమెరికా సైనిక విమానాలు ధ్వంసమైనట్లు సమాచారం. ఈ సైనిక చర్యకు ఇప్పటికే దాదాపుగా 29 బిలియన్ డాలర్లు ఖర్చు అయినట్లు పెంటగాన్ ప్రకటించింది.
ధ్వంసమైన యుద్ధ విమానాల్లో అమెరికా అత్యాధునిక F-15E స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్లు నాలుగు, ఒక F-35A లైట్నింగ్ II ఫైటర్ విమానం, ఒక A-10 థండర్‌బోల్ట్ II గ్రౌండ్-ఎటాక్ విమానం, ఏడు KC-135 స్ట్రాటోట్యాంకర్ ఏరియల్ రీఫ్యూయలింగ్ విమానాలు, ఒక E-3 సెంటినల్ ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్-అండ్-కంట్రోల్ సిస్టమ్ (AWACS) విమానం, రెండు MC-130J కమాండో II స్పెషల్ ఆపరేషన్ విమానాలు, ఒక HH-60W జాలీ గ్రీన్ II వార్ రిసెర్చ్-రక్షణ హెలికాప్టర్, 24 MQ-9 రీపర్ డ్రోన్, ఒక MQ-4C ట్రైటాన్ డ్రోన్లు ఉన్నాయి.
Also Read
- 22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
ఇదిలా ఉంటే అమెరికా రక్షణ శాఖ ఇప్పటి వరకు యుద్ధ నష్టాలపై సమగ్ర అంచనాలను ప్రచురించలేదు. అమెరికా కాంగ్రెస్, కమిటీలు రక్షణశాఖ, అమెరికా సెంట్రల్ కమాండ్(CENTCOM) వార్తలు, నివేదికల ఆధారంగా నష్టాలను అంచనా వేసింది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధంలో మొదటి రోజు ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని హతమార్చింది. ఆ తర్వాత ఇరాన్ యూఎస్‌కు వ్యతిరేకంగా బలంగా దాడులు చేసింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేసింది. ఇదే కాకుండా యూఏఈ, బహ్రైయిన్, ఖతార్, కువైట్ వంటి దేశాల్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ను దెబ్బతీసింది.
తాజావార్తలు
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!