Trump Tariffs on India: భారత్ పై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్స్ విధించడాన్ని యూఎస్ ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తాజాగా, హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ డెమోక్రాట్స్ ట్రంప్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రష్యా నుంచి ఆయిల్ భారీగా కొంటున్న చైనా తదితర దేశాలపై సుంకాలు వేయకుండా ఇండియానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని క్వశ్చన్ చేశారు.యూఎస్ – భారత్ సంబంధాలను దెబ్బ తీస్తున్నారు.. దీని వల్ల అమెరికన్స్ కు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఇది ఉక్రెయిన్ కోసం చేస్తున్నట్లు అనిపించడం లేదు అని హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ డెమోక్రాట్స్ మండిపడ్డారు.
Read Also: Gold Rates: మరింత పెరిగిన బంగారం ధర.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
ఇక, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికన్ వినియోగదారులు, వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హౌస్ డెమోక్రాట్స్ పేర్కొన్నారు. దీని ఫలితంగా వస్తువుల ధరలు పెరగడంతో పాటు ఉద్యోగ అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా, భారత్‌పై విధించిన టారీఫ్‌లను తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఇండియాను టార్గెట్ చేయడం మానుకోవాలని సూచించారు.
