NTV Telugu Site icon

US Dentist Crime: క్లూ లేకుండా భార్యని చంపాడు.. కానీ చివరికి అలా బుక్కయ్యాడు

Dentist Craig

Dentist Craig

US Dentist Accused Of Killing Wife By Lacing Shake With Cyanide: తన ప్రియురాలితో ఒక కొత్త జీవితం ప్రారంభించేందుకు.. ఓ భర్త పక్కా ప్లాన్ ప్రకారం తన భార్యని హతమార్చాడు. ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు కలగకుండా, చిన్న క్లూ దొరక్కుండా.. భార్యని చంపేశాడు. వైద్యులు సైతం అతని భార్య బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిందని సర్టిఫికెట్ ఇచ్చారు కూడా! ఇంకేముంది.. తన ప్లాన్ సక్సెస్ అయ్యిందని అతడు ఎగిరి గెంతులేశాడు. కానీ, ఆ వెంటనే పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. చనిపోవడానికి ముందు.. ఆ వ్యక్తి భార్య ఒకే తరహా లక్షణాలతో ఆసుపత్రిపాలవ్వడమే అతని బండారాన్ని బట్టబయలు చేసింది. భర్తపై అనుమానాలు రేకెత్తెలా చేయడంతో, పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేశారు. ఫైనల్‌గా.. భర్తే హతమార్చాడని తేల్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Unusual Love Story: విడదీయరాని బంధం.. 60 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న ప్రేమపక్షులు..

యూఎస్‌లో క్రెయిగ్ (45) అనే వ్యక్తి డెంటిస్ట్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల ఇతని భార్య ఏంజెలా ఉన్నట్లుండి మృతి చెందింది. వైద్యులు సైతం ఆమె బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందినట్టు నిర్ధారించారు. అయితే.. చనిపోవడానికి ముందు ఆమె ఒకే తరహా లక్షణాలతో అది కూడా ఒకే నెలలో మూడుసార్లు ఆసుపత్రికి వచ్చిన విషయం పోలీసులకు కాస్త తేడాగా అనిపించింది. దీంతో.. ఈ కేసుని క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టారు. ఏంజెలా మెడికల్ రిపోర్ట్‌ని చెక్ చేశారు. అందులో.. ఏంజెలా శరీరంలో ఆర్సెనిక్ అవశేషాలు ఉన్నట్లు తేలింది. ఇంకేముంది.. పోలీసుల అనుమానం నిజమైంది. భర్తే హతమార్చాడని కొలిక్కి వచ్చి, అతడ్ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. మొదట్లో అతడు నేరం అంగీకరించలేదు కానీ, పోలీసులు తమదైన శైలిలో అడిగినప్పుడు అసలు నిజం కక్కాడు. తన ప్రియురాలి కోసమే ఇదంతా చేశానని నేరం అంగీకరించాడు.

Extramarital Affair: భర్తని వదిలి ప్రియునితో కాపురం.. కట్ చేస్తే ఊహించని దారుణం

తన భార్యకు స్వయంగా తానే ప్రొటీన్ షేక్‌లో ఆర్సెనిక్, సైనేడ్ కలిపి ఇచ్చేవాడినని.. అది తాగిన కొద్దిసేపటికే ఆమె అనారోగ్యానికి గురయ్యేదని క్రెయిగ్ చెప్పాడు. తన భార్య చనిపోయిన రోజు కూడా ప్రొటీన్ షేక్‌లో సైనేడ్ కలిపి ఇచ్చినట్లు తెలిపాడు. తనకు తీవ్రమైన తలనొప్పి వస్తోందని, నీరసంగా ఉందని భార్య చెప్పడంతో.. క్రెయిగ్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఇదే లక్షణాలతో ఆల్రెడీ మూడుసార్లు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. అయితే.. ఈసారి ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మృతిచెందింది. ‘ఎలాంటి క్లూ లేకుండా, ఏ తరహా విషంతో ఒక వ్యక్తిని హతమార్చవచ్చు?’ అని అతడు పలుమార్లు ఆన్‌లైన్‌లో శోధించాడని తెలిసింది. ఎన్ని గ్రాముల సైనేడ్‌ కలిపితే పోస్ట్‌మార్టంలో గుర్తించలేరో తెలుసుకుని.. అతడు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు తేల్చారు.

Chetan Kumar: హిందుత్వపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.. జైలుపాలయ్యాడు

ఈ కేసులో ఏంజెలా సోదరి టోనీ కోఫోడ్ మాట్లాడుతూ.. క్రెయిగ్ టీనేజ్ నుంచి అశ్లీలతలకు బానిసయ్యాడని, అతనికి చాలామందితో అక్రమ సంబంధాలు కూడా ఉన్నాయని తెలిపింది. గత ఐదారేళ్ల నుంచి ఏంజెలాకు అతడు డ్రగ్స్ ఇస్తున్నాడని చెప్పింది. మార్చి నెల ప్రారంభంలో.. తనకేదో మత్తుమందు తాగినట్లు అనిపించిందని, ఏంజెలా తనకు మెసేజ్ చేసిందని కూడా పేర్కొంది. ఆమె వాంగ్మూలంతో పాటు పలు ఆధారాలను సేకరించాక.. క్రెయిగ్‌పై కేసు నమోదు చేసి, కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసు విచారణ పూర్తి అయ్యేంతవరకు.. తన ఆరుగురు పిల్లలను సైతం కలిసేందుకు వీలులేదని కోర్టు అతనికి స్పష్టం చేసింది.

Show comments