26/11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారి తహవూర్ రాణాకు అమెరికా న్యాయస్థానం షాకిచ్చింది. తనను భారత్‌కు అప్పగించవద్దంటూ ఇటీవల యూఎస్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది.
ఇది కూడా చదవండి: Kalpana : రూమర్స్ కు చెక్ పెడుతూ సింగర్ కల్పన సెల్ఫీ వీడియో..
తాను ముస్లిం కాబట్టి.. భారత్‌లో తనను హింసిస్తారని రాణా పిటిషన్‌లో పేర్కొన్నాడు. ప్రాణాంతక జబ్బులతో పోరాడుతున్న తనను భారత్‌కు అప్పగించడమంటే మరణశిక్ష విధించడమేనని పేర్కొన్నాడు. తన అప్పగింత అమెరికా చట్టాలతో పాటు ఐరాస తీర్పుల ఉల్లంఘనే అని తెలిపాడు. ఈ నేపథ్యంలో అప్పగింతపై స్టే విధించాలని తహవూర్ పిటిషన్ పేర్కొన్నాడు. అయినా కూడా అమెరికా కోర్టు స్టే ఇచ్చేందుకు అంగీకరించలేదు.
ఇది కూడా చదవండి: Bengaluru: దారుణం.. బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్న యువకుడు
పాక్ సంతతికి చెందిన కెనడా జాతీయుడైన రాణా.. ప్రస్తుతం లాస్‌ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ జైల్లో ఉన్నాడు. పాక్–అమెరికా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో అతనికి దగ్గరి సంబంధాలున్నాయి.
ఇది కూడా చదవండి: TS SSC Hall Ticket 2025: టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచే వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్