US–Bangladesh Trade Deal: అమెరికా-బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య ఒప్పందం.. కేవలం 1 శాతం తగ్గిన పన్నులు..!
- అమెరికాతో బంగ్లాదేశ్ వాణిజ్య ఒప్పందం..
- సుంకాన్ని కేవలం 1 శాతం తగ్గించిన ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US–Bangladesh Trade Deal: అమెరికా–బంగ్లాదేశ్ మధ్య కొత్త వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీర్ఘకాల చర్చల అనంతరం అమెరికా బంగ్లాదేశ్‌పై విధిస్తున్న సుంకాలను కేవలం 1 శాతం మాత్రమే తగ్గిస్తూ 19 శాతానికి పరిమితం చేసింది. తొమ్మిది నెలల పాటు సాగిన చర్చల తర్వాత ఈ ఒప్పందం ఖరారైంది. మొదటగా బంగ్లాదేశ్ ఎగుమతులపై 37 శాతం వరకు సుంకాలు విధిస్తామని అమెరికా హెచ్చరించడంతో ఢాకా తీవ్ర ఆందోళనకు గురైంది. ఆ తర్వాత సుదీర్ఘ చర్చల నేపథ్యంలో గత ఆగస్టులో ఈ సుంకాన్ని 20 శాతానికి తగ్గించిన అమెరికా, తాజాగా మరో 1 శాతం తగ్గిస్తూ 19 శాతంతో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసింది.
ఫిబ్రవరి 12న జరగనున్న బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు, తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించారు. కొత్త ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ప్రకారం, బంగ్లాదేశ్ దిగుమతులపై పరస్పర సుంకాలు 19 శాతానికి తగ్గినట్లు తెలిపారు. అంతేకాకుండా, అమెరికాలో తయారైన కొన్ని వస్త్రాలు, దుస్తుల ఉత్పత్తులకు సుంకం లేకుండా మార్కెట్ ప్రవేశం కల్పిస్తామని యూనస్ వెల్లడించారు. అమెరికన్ పత్తి లేదా మానవ నిర్మిత ఫైబర్లతో తయారైన కొన్ని బంగ్లాదేశ్ వస్త్రాలకు సున్నా సుంకంతో అమెరికా మార్కెట్లో ప్రవేశం కల్పించే మార్గాన్ని వాషింగ్టన్ హామీ ఇచ్చింది అని యూనస్ సోషల్ మీడియా వేదిక Xలో పేర్కొన్నారు.
Also Read
- Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్‌లు.. నెట్టింట తీవ్ర వివాదం
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
ఈ ఒప్పందం ద్వారా బంగ్లాదేశ్ వస్త్ర రంగానికి గణనీయమైన ఉపశమనం లభించనుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, ఒక ముఖ్యమైన షరతు కూడా ఉంది. అమెరికన్ కాటన్ లేదా కృత్రిమ ఫైబర్లతో తయారైన దుస్తులకే సున్నా సుంకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. దీంతో అమెరికన్ ముడి పదార్థాలతో తయారయ్యే వస్త్రాలకు మార్కెట్ డిమాండ్ ఎలా ఉంటుందన్న అంశం కీలకంగా మారింది. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు వస్త్ర రంగమే వెన్నెముక. దేశ మొత్తం ఎగుమతి ఆదాయంలో 80 శాతానికి పైగా ఈ రంగం నుంచే వస్తోంది. సుమారు 4 కోట్ల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం, జీడీపీలో దాదాపు 10 శాతం వాటాను కలిగి ఉంది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, ఇంధన ధరలు, కరెన్సీ హెచ్చుతగ్గులు, అంతర్జాతీయ ప్రమాణాల ఒత్తిడి కారణంగా ఇటీవలి కాలంలో వస్త్ర పరిశ్రమ ఇబ్బందులను ఎదుర్కొంది.
తక్కువ సుంకం రేటు అమెరికా వంటి అతిపెద్ద ఎగుమతి మార్కెట్లో బంగ్లాదేశ్ తయారీదారుల పోటీతత్వాన్ని కొనసాగించేందుకు దోహదపడుతుందని పరిశ్రమ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగ భద్రత, ప్రపంచ వస్త్ర సరఫరా గొలుసులో బంగ్లాదేశ్ స్థానాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుందని యూనస్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఈ వాణిజ్య ఒప్పందం రాజకీయంగా కూడా కీలక సమయంలో కుదిరింది. బంగ్లాదేశ్‌లో మరో 48 గంటల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 2024 ఆగస్టులో జరిగిన రాజకీయ పరిణామాల తర్వాత దేశం తాత్కాలిక ప్రభుత్వ పాలనలో ఉంది. ఎన్నికలకు ముందు చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో, ఆర్థిక స్థిరత్వం మరియు అంతర్జాతీయ విశ్వాసాన్ని ప్రదర్శించేందుకు ఈ వాణిజ్య ఒప్పందం ఉపయోగపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
-
Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!