Site icon NTV Telugu

US: వెనిజులా తీరంలో మరో డ్రగ్స్ నౌకపై అమెరికా దాడి.. నలుగురు హతం

Us

Us

మాదక ద్రవ్యాలపై అమెరికా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వెనిజులా తీరంలో మరో డ్రగ్స్ నౌకపై అమెరికా దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురు హతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

శుక్రవారం వెనిజులా తీరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా పడవపై అమెరికా దళాలు జరిపిన దాడిలో నలుగురు మృతి చెందారని రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ తెలిపారు. డ్రగ్స్ నౌకలపై దాడి చేసిన సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటి వరకు 21 మంది మరణించారని పీట్ హెగ్సేత్ పేర్కొన్నారు. తాజా వీడియోలో ఒక నౌక వేగంగా దూసుకుపోతుండగా ఒక్కసారిగా దట్టమైన పొగ కమ్ముకుంది.

ఇది కూడా చదవండి: Trump-Hamas: ట్రంప్ ప్లాన్‌పై హమాస్ సంచలన నిర్ణయం

తాజా దాడిలో నలుగురు నార్కో ఉగ్రవాదులు మరణించారని పెంటగాన్ చీఫ్ తెలిపారు. వెనిజులా తీరానికి కొద్ది దూరంలో అంతర్జాతీయ జలాల్లో నౌకను గుర్తించి దాడి చేసినట్లుగా పేర్కొన్నారు. నౌకలో మాదక ద్రవ్యాలు ఉన్నాయని తెలిపింది. ప్రజలకు విషం ఇవ్వడానికి అమెరికాకు వస్తుండగా పేల్చేసినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: POK: పాక్ “పోకిరి రాజ్యం” : పీఓకే నాయకుడు జమీల్ మక్సూద్

25-50 వేల మందిని చంపడానికి తగినంత మాదక ద్రవ్యాలతో నిండిన పడవను వెనిజులా తీరంలో అమెరికన్ భూభాగంలోకి ప్రవేశించకుండా ఆపినట్లు ట్రంప్ తెలిపారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో హెగ్సేత్ చేసిన వీడియోనే పోస్ట్ చేశారు.

 

Exit mobile version