Site icon NTV Telugu

Trump: ట్రంప్ మరో కీలక నిర్ణయం.. మిలిటరీలో ట్రాన్స్‌జెండర్ల నియామకంపై నిషేధం

Trump2

Trump2

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మిలిటరీలో ట్రాన్స్‌జెండర్ల నియామకంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్‌జెండర్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా మిలిటరీ విభాగంలో ట్రాన్స్‌జెండర్‌ల నియామకాన్ని నిషేధించినట్లుగా అమెరికా సైన్యం ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆర్మీ పేర్కొంది.

ఇది కూడా చదవండి: GBS Virus : మహారాష్ట్రలో విధ్వంసం సృష్టిస్తున్న కొత్త వైరస్.. ఇప్పటి వరకు 9మంది మృతి.. 207మంది బాధితులు

డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ట్రాన్స్‌జెండర్లు సాయుధ దళాల్లో చేరుకుండా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అప్పటికే సైన్యంలో పని చేస్తున్న వారిని మాత్రం కొనసాగించారు. తాజాగా మరోసారి లింగమార్పిడి వ్యక్తులను సైన్యంలో చేరకుండా నిషేధించింది.

ఇది కూడా చదవండి: Vallabaneni Vamshi: వల్లభనేని వంశీ ఫోన్ కోసం గాలిస్తున్న పోలీసులు..

Exit mobile version