Site icon NTV Telugu

తాజా నివేదికః ఒక్క డోసుతో త‌గ్గుతున్న 60 శాతం ముప్పు

క‌రోనా మహ‌మ్మారి నుంచి ప్ర‌పంచం ఇంకా కోలుకోలేదు.   ముప్పుభ‌యంతోనే ప్ర‌జ‌లు జీవ‌నం సాగిస్తున్నారు.  వ్యాక్సిన్ అందుబాటులోకి రావ‌డంతో కొంత భ‌యం త‌గ్గిన‌ప్ప‌టికీ, వైర‌స్ వేరియంట్ లు భ‌య‌పెడుతున్నాయి. వృద్దులపై వ్యాక్సిన్ ఏ మేర‌కు ప‌నిచేస్తున్న‌ది అనే విష‌యంపై యూనివ‌ర్శిటి కాలేజ్ ఆఫ్ లండ‌న్ ప‌రిశోధ‌కులు ప‌రిశోధ‌న‌లు చేశారు.  

Read: చిరంజీవిని ఎందుకు లాగుతున్నారు ? : ప్రకాష్ రాజ్

60 ఏళ్లు పైబ‌డిన వృద్దులు సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవ‌డం వ‌ల‌న 60 శాతం మేర ముప్పు త‌ప్పుతుంద‌ని ప‌రిశోధ‌కుల ప‌రిశోధ‌న‌లో తేలింది.  క‌రోనాపై ఫైజ‌ర్‌, కోవీషీల్డ్ టీకాలు స‌మ‌ర్ధ‌వంతంగా ప‌నిచేస్తున్నాయ‌ని, క‌నీసం ఒక్క డోసు తీసుకుంటే 28-34 రోజుల్లో 56 శాతం, 38-45 రోజుల త‌రువాత 62 శాతం క‌రోనా బారిన ప‌డే ముప్పు త‌గ్గుతంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. 

Exit mobile version