Site icon NTV Telugu

Russia-Ukraine War: ఉక్రెయిన్‌కు అమెరికా భారీ ఆర్థిక సాయం..

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరాన్ని స్వాధీనం చేసుకునే పనిలోపడిపోయాయి రష్యా దళాలు.. అధ్యక్ష భవనాన్ని కూడా చుట్టుముట్టాయి.. ఇదే సమయంలో.. వరుస వీడియోలు విడుదల చేస్తూ.. ఆయుధాలు వీడొద్దు అంటూ పిలుపునిస్తున్నారు.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. మొదటి వీడియోలో తాను ఇక్కడే ఉన్నాను.. పోరాడుతాం.. ఉక్రెయిన్‌ను కాపాడుకుంటా.. ఆయుధాలు కావాలని పేర్కొన్న ఆయన.. ఇక, రెండో వీడియోలో ఏకంగా కీవ్‌ వీధుల్లో తిరుగుతూ చేశారు.. ఆయుధాలు వీడొద్దు అని కోరారు..

Read Also: Vijayashanti: శివుడు మూడో కన్ను తెరుస్తాడు.. కేసీఆర్ సంగతి తేలుస్తాడు..

ఇక, ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం అమెరికా భారీగా ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.. 600 మిలియన్ డాలర్ల సాయాన్ని అందిస్తున్నట్టు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.. తక్షణ సైనిక అవసరాల కోసం ఇది వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.. మరోవైపు, ఉక్రెయిన్‌ను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఇప్పటికే అమెరికా ప్రకటించింది. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభంచగానే అమెరికా రష్యాపై అనేక ఆంక్షలను విధించింది. దీంతో పాటు ఉక్రెయిన్ కు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పేందుకు భారీ సాయాన్ని అమెరికా ప్రకటించింది. ఉక్రెయిన్‌ నుంచి ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీని కాపాడేందుకు ఆఫర్‌ చేయగా.. ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే.

Exit mobile version