NTV Telugu Site icon

UN On Taliban: తాలిబన్‌లను ఒప్పించలేకపోతే.. తప్పుకోవడానికి సిద్ధం

Un On Afghanistan Women

Un On Afghanistan Women

UN To Withdraw From Afghanistan Over Taliban Curbs On Women: స్థానిక మహిళలను సంస్థలో పని చేసేందుకు అనుమతించమని తాము తాలిబన్లను ఒప్పించలేకపోతే.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నట్టు యూఎన్ పేర్కొందని యూఎస్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ హెడ్ తెలిపారు. స్థానిక మహిళలు సంస్థలో పని చేయడాన్ని నిషేధించే డిక్రీకి మినహాయింపులు ఇస్తారనే ఆశతో తాలిబన్ ప్రభుత్వంతో యూఎన్ చర్చలు జరుపుతోంది. ఈ సందర్భంగా యూఎన్‌డీపీ అడ్మినిస్ట్రేటర్ అచిన్ స్టైనర్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో యూఎన్ వ్యవస్థ ఒక అడుగు వెనక్కి వేసి, అక్కడ (ఆఫ్ఘనిస్తాన్‌లో) పనిచేయగల సామర్థ్యాన్ని పునఃపరిశీలించవలసి ఉంటుందన్నారు.

Fake IAS Officer: ఐఏఎస్ అధికారిలా నటించి మహిళను మోసం చేశాడు.. చివరకు..!

ఆఫ్ఘనిస్తాన్‌లోని తూర్పు ప్రావిన్స్ నంగర్‌హార్‌లో ఆఫ్ఘన్ మహిళా UN సిబ్బంది పని చేయడంపై తాలిబన్లు నిషేధం విధించిన తర్వాత ఐక్యరాజ్యసమితి ఇటీవల తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసింది. అంతర్జాతీయ సంస్థ సిబ్బందిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నందున.. మహిళా సిబ్బంది లేకుండా ‘లైఫ్-సేవింగ్ ఎయిడ్’ ప్రమాదంలో పడుతుందని తాలిబన్‌లను యూఎన్ హెచ్చరించింది. మహిళా సిబ్బంది లేకుండా యునైటెడ్ నేషన్స్ ఎంటిటీస్ ఆపరేట్ చేయలేవని కూడా ట్విటర్ మాధ్యమంగా వెల్లడించింది. మహిళా సిబ్బంది లేకుంటే.. ఆ సంస్థలు నిరుపేద మహిళలను చేరుకోలేవని చెప్పుకొచ్చింది. అందుకే.. సహాయ రంగం నుండి మహిళలను మినహాయించాలని యూఎన్ సహా అంతర్జాతీయ సంస్థలు పదేపదే తమ ఆందోళనలను తాలిబన్‌లకు వ్యక్తం చేశాయి. కానీ.. తాలిబన్లు మాత్రం వారి అభ్యర్థనను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

Romantic Fight: రొమాన్స్ విషయంలో గొడవ.. బావిలో దూకిన భార్య.. ఆ తర్వాత ఏమైందంటే?

కాగా.. 2021 ఆగస్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి తాలిబన్లు మహిళలు, బాలికలపై ఎన్నో నిషేధాలు విధించింది. విద్య అవసరం లేదని, ఉద్యోగాలు చేయాల్సిన పని లేదంటూ.. ఆ రెండు రంగాలను వారి నుంచి దూరం చేసింది. తొలుత బాలికలు ఆరవ తరగతి దాటి పాఠశాలకు వెళ్లడాన్ని నిషేధించిన తాలిబన్లు.. డిసెంబరు 2022లో జాతీయ & అంతర్జాతీయ NGOలతో మహిళలు పనిచేయడాన్ని బ్యాన్ చేశారు. అయితే.. ఈ ఆంక్షల పట్ల జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇది ఆఫ్ఘనిస్తాన్‌లోని అత్యంత అవసరమైన ప్రజలకు మానవతా సహాయానికి అంతరాయం కలిగిస్తుందని హెచ్చరిస్తున్నాయి. కానీ.. తాలిబన్లు మాత్రం తమ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని పట్టుబడుతోంది.