రష్యా ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు దారుణంగా దిగజారిపోయాయి. బోర్డర్‌లో ఉక్రెయిన్ సైన్యం దాడులు చేస్తోందని రష్యా ఆరోపిస్తుండగా, ఇదంతా ఫేక్ వార్తలని, తాము ఎలాంటి దాడులు చేయడం లేదని ఉక్రెయిన్ సైన్యం చెబుతున్నది. గత కొంతకాలంగా రెండు దేశాల మధ్య పరిస్థితులు మారిపోవడంతో ఉక్రెయిన్‌ను కాపాడుకోవడానికి అక్కడి మహిళలు తాము సైతం అంటూ యుద్ధ శిక్షణ తీసుకుంటున్నారు. యుద్ధం అనివార్యమైతే దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మహిళలు చెబుతున్నారు.
Read: Moon: మార్చి 4న చంద్రుడిని ఢీకొట్టనున్న రాకెట్… మాది కాదంటున్న చైనా…
తుపాకీ పట్టడం, కాల్పులు జరపడం వంటి వాటిల్లో ఇప్పటికే అనేక మంది మహిళలు శిక్షణ పొందారు. చిన్నారుల నుంచి ముసలివారి వరకు యుద్ద విద్యలో శిక్షణ పొందుతున్నారు. యుద్దవిద్యలో శిక్షణ పొందిన మహిళలు తుపాకులు చేపట్టిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, యూనైటెడ్ సోవియట్ యూనియన్ ను తిరిగి సాధించేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సోవియట్ యూనియన్ దేశాలను తిరిగి కలుపుకొని పునర్వైభవాన్ని తీసుకురావాలని చూస్తున్నది రష్యా.
