Site icon NTV Telugu

Russia-Ukraine War: 10 వేల మంది రష్యా సైనికులు హతం..

ఉక్రెయిన్‌పై భీకర దాడులు కొనసాగిస్తోంది రష్యా.. ఇరు దేశాల మధ్య యుద్ధం పదో రోజుకు చేరుకోగా… రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత తన విశ్వరూపాన్ని చూపిస్తూ.. విరుచుకుపడుతున్నాయి పుతిన్‌ సేనలు.. అయితే, యుద్ధంలో ఇప్పటి వరకు 10,000 మంది రష్యా సైనికులు హతమయ్యారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం 10వ రోజులోకి ప్రవేశించిగా.. 10,000 మంది రష్యన్ సైనికులు మరణించారని పేర్కొన్నారు జెలెన్‌స్కీ… అయితే, ఉక్రెయిన్ తన సాయుధ బలగాల మరణాల గణాంకాలను మాత్రం విడుదల చేయలేదు. ఫిబ్రవరి 24న రష్యా.. ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుండి 10,000 మంది రష్యన్ సైనికులు మరణించారని.. 39 యుద్ధ విమానాలు, 40 హెలికాప్టర్లతో సహా 1,870 యూనిట్ల భారీ మరియు తేలికపాటి సైనిక పరికరాలు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ శనివారం పేర్కొంది.

Read Also: Russia-Ukraine War: పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు..

ఉక్రేనియన్ జనరల్ స్టాఫ్ ప్రకటన ప్రకారం, 39 విమానాలు, 40 హెలికాప్టర్లు, 269 ట్యాంకులు, 945 సాయుధ వాహనాలు, 105 ఫిరంగి వ్యవస్థలు, 409 వాహనాలు మరియు 60 ఇంధన ట్యాంకులు ధ్వంసమయ్యాయి. మూడు మానవరహిత వైమానిక వాహనాలు కూడా నిలిపివేయబడ్డాయి. ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24న ప్రారంభమైన రష్యా యుద్ధం.. అంతర్జాతీయ ఆగ్రహానికి దారితీసింది, యూఈ, యూఎస్‌, యూకే మరియు ఇతర దేశాలు మాస్కోపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించాయి. పశ్చిమ దేశాలు కూడా ఉక్రెయిన్‌కు ఆయుధాలు, ఇతర సహాయాన్ని అందజేస్తున్నాయి.. అయితే, అన్ని లక్ష్యాలను సాధించే వరకు యుద్ధం కొనసాగుతుందని పుతిన్ పేర్కొన్నారు.. UN మానవ హక్కుల కార్యాలయం ప్రకారం, యుక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కనీసం 331 మంది పౌరులు మరణించారు, 675 మంది గాయపడ్డారు. UN రెఫ్యూజీ ఏజెన్సీ ప్రకారం, 1.2 మిలియన్లకు పైగా ప్రజలు ఉక్రెయిన్ నుండి పొరుగు దేశాలకు పారిపోయారు.

Exit mobile version