Site icon NTV Telugu

Ukraine Russia War: ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడిలో, 40 రష్యన్ విమానాలు ఖతం..

Russia

Russia

Ukraine Russia War: ఉక్రెయిన్ రష్యాపై భారీ డ్రోన్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ రష్యా వైమానిక స్థావరం టార్గెట్‌గా జరిపిన దాడిలో 40కి పైగా రష్యన్ విమానాలు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ దేశీయ భద్రతా సంస్థ, సెక్యూరిటీ సర్వీస్ ఆఫ్ ఉక్రెయిన్ (SBU) అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ఉక్రెయిన్‌పై లాంగ్-రేంజ్ క్షిపణులను ప్రయోగించడానికి మోహరించే Tu-95, Tu-22 వ్యూహాత్మక బాంబర్‌లతో సహా రష్యన్ విమానాలను ఉక్రెయిన్ దళాలు నాశనం చేసినట్లు పేర్కొంది.

Read Also: Amit Shah: ముస్లిం ఓటు బ్యాంకు కోసమే మమతాబెనర్జీ ఆరాటం.. ‘‘సిందూర్’’, ‘‘వక్ఫ్ చట్టాన్ని’’పై వ్యతిరేకత..

రష్యాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలోని స్రెడ్నీ సెటిల్మెంట్ లోని సైనిక యూనిట్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసిందని ప్రాంతీయ గవర్నర్ ఇగోర్ కోబ్జెవ్ అన్నారు. ముర్మాన్స్క్ ప్రాంతంలోని ఒలెన్యా ఎయిర్ బేస్ సమీపంలో పేలుళ్లు, భారీ పొగలు గమనించినట్లు బెలారసియన్ వార్తా మీడియా సంస్థ NEXTA నివేదించింది. ఎక్స్‌లో ఫోటోలు, వీడియోలను పంచుకుంది. ప్రాథమికంగా ఇది డ్రోన్ దాడి అని నివేదికలు సూచిస్తున్నాయి. ఒలెన్యా రష్యాకు సంబంధించి కీలకమైన ఎయిర్ బేస్. ఈ బేస్‌లో అణ్వాయుధాలను మోసుకెళ్లే విమానాలు ఉంటాయి. అయితే, దీనిపై ఇంకా పూర్తి స్థాయి స్పష్టత, ధ్రువీకరణ రాలేదు. ఒక వేళ ఇదే నిజమైతే రష్యాపై జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది కూడా ఒకటిగా పరిగణించబడుతుంది.

ఇటీవల రష్యా, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో సహా పలు నగరాలపై 367 డ్రోన్లు, క్షిపణులతో దాడులు నిర్వహించింది. ఇప్పటి వరకు యుద్ధంలో ఇదే అతిపెద్ద వైమానిక దాడిగా పరిగణించబడుతోంది. ఈ దాడిలో జైటోమిర్‌లో ముగ్గురు పిల్లలు సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు మరియు డజన్ల కొద్దీ గాయపడ్డారు. కైవ్, ఖార్కివ్, మైకోలైవ్, టెర్నోపిల్ మరియు ఖ్మెల్నిట్స్కీలపై దాడులు జరిగాయి. ఇది జరిగిన వారం తర్వాత, తాజాగా ఉక్రెయిన్ రష్యా వైమానిక స్థావరంపై దాడి చేసింది.
\https://twitter.com/StratcomCentre/status/1929126928008564787

Exit mobile version