Site icon NTV Telugu

బ్రిటన్‌లో ఒమిక్రాన్‌ విలయం..!

సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ జట్‌ స్పీడ్‌తో ప్రపంచాన్ని చుట్టేసేపనిలో పడిపోయింది.. ఇప్పటికే 57 దేశాలకు పాకేసిన ఒమిక్రాన్‌ కేసులు కొన్ని దేశాల్లో పెద్ద ఎత్తున వెలుగు చూస్తున్నాయి.. బ్రిటన్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్ విలయమే సృష్టిస్తోంది.. ఒకే రోజు 101 కొత్త కేసులు నమోదయ్యాయి.. దీంతో.. అక్కడి ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్‌ వేరియంట్ కేసుల సంఖ్య 437కు చేరుకుందని బ్రిటిన్‌ ఆరోగ్య అధికారులు వెల్లడించారు.. డెల్టా వేరియంట్‌ కంటే కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని బ్రిటీష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కేబినెట్‌ సమావేశంలో వ్యాఖ్యానించారు.. కొత్త వేరియంట్‌ భయాలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. వైరస్‌ కట్టడికి చర్యలు చేపట్టాలని సూచించారు.. మరోవైపు కరోనా పాజిటివ్‌ కేసులు ఇంకా భారీగానే వెలుగుచూస్తున్నాయి బ్రిటన్‌.. కొత్తగా 45,691 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 10,560,341కు చేరింది. ఇక, ఇప్పటి వరకు 1,45,826 మంది కోవిడ్‌తో ప్రాణాలు వదిలారు.

Exit mobile version