NTV Telugu Site icon

UK PM Race: రిషి సునక్ కు షాక్.. లిజ్ ట్రస్ కే గెలుపు అవకాశాలు ఎక్కువన్న సర్వే

Liz Truss, Rishi Sunak

Liz Truss, Rishi Sunak

Liz Truss leads with 90 pc chance in race for next UK PM: యూకే ప్రధాని రేసులో రిషి సునక్ కు షాక్ తగిలేలా కనిపిస్తోంది. ముందు నుంచి ప్రధాని రేసులో ముందువరసలో ఉన్న రిషి సునక్ కీలకమైన పోటీని ఎదుర్కొంటున్నారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల మద్దతు గెలుచుకోవడంతో పాటు ప్రజాప్రతినిధుల ఓట్లను సంపాదించాల్సి ఉంది. అయితే తాజాగా బెట్టింగ్ ఎక్స్ఛేంజ్ సంస్థ స్మార్కెట్స్ ప్రకారం.. యూకే తదుపరి ప్రధాని రేసులో రిషి సునక్ కన్నా.. లిజ్ ట్రస్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. సర్వే ప్రకారం ట్రస్ 89.29 శాతం, రిషి సునక్ కు 10 శాతం అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.

ప్రస్తుతం తాము ప్రధాని అయితే.. యూకేలో ఎలాంటి సంస్కరణలు తీసుకురాబోతున్నామో.. ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నామనే దానిపై రిషి సునన్, లిజ్ ట్రస్ లు ప్రసంగిస్తున్నారు. రిషి సునక్ ఆర్థిక సమస్యలతో పాటు యూకేలో ఆరాచకంగా మారుతున్న డౌన్ బ్లౌసింగ్, గ్రూమింగ్ ముఠాలకు అడ్డుకట్ట వేసి మహిళలకు రక్షణ కల్పిస్తారని అన్నారు. ఇక లిజ్ ట్రస్ ఆయిల్, గ్యాస్ కంపెనీలపై మరింత విండ్‌ఫాల్ పన్నులు విధించకూడదనే హామీని ఇచ్చింది. ఇదిలా ఉంటే శుక్రవారం జరిగిన డిబెట్ లో టోరీ సభ్యులు మాజీ ఆర్థికమంత్రి సునక్ కు పలు ప్రశ్నలు సంధించారు. ప్రధాని బోరిస్ జాన్సన్ కు ఎందుకు వెన్నుపోటు పొడిచావంటూ ప్రశ్నించారు.

ప్రస్తుత సర్వే ప్రకారం మొత్తం సభ్యుల్లో 31 శాతం మంది సభ్యులు రిషి సునక్ ఓటు వేయాలని భావిస్తుండగా.. 49 శాతం లిజ్ ట్రస్ కు ఓటు వేయాలని భావిస్తున్నారని.. మరో 15 మంది ఎవరికి వేయాలో నిర్ణయించుకోలేదని.. మరో 6 శాతం మంది ప్రస్తుతం తాము ఓటు వేయబోమని చెప్పారు. సెప్టెంబర్ 5న బ్రిటన్ కొత్త ప్రధాని ఎవరనేది తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేసి ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతున్నారు.

Show comments