Site icon NTV Telugu

Keir Starmer: ప్రమాదంలో యూకే ప్రధాని స్టార్మర్!.. ఎప్‌స్టీన్ ఫైల్‌‌‌పై అడ్వాన్స్‌గా క్షమాపణలు

Keir Starmer

Keir Starmer

అమెరికా ఫైనాన్షియర్ ఎప్‌స్టీన్ సెక్స్ స్కామ్ ఫైల్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అమెరికాతో పాటు ఆయా దేశస్థుల్లో వణుకుపుట్టిస్తోంది. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన తాజా ఫైల్‌లో బడా ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ప్రపంచం వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు కలిగిన నాయకులంతా ఈ కుంభకోణంలో ఉన్నట్లు వెల్లడైంది.

ఆశ్చర్యకరంగా ఎప్‌‌స్టీన్ ఫైల్‌లో పేరు లేకపోయినా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పందించారు. బహిరంగంగా ఎప్‌స్టీన్ ఫైల్‌పై క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు. పేరు లేకపోయినా హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే..
అయితే కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఇరాకటంలో ఉన్నట్లు తెలుస్తోంది. సొంత లేబర్ పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో లార్డ్ పీటర్ మాండెల్సన్‌ను అమెరికాలో రాయబారిగా నియమించారు. ఈ రాయబారికి ఎప్‌స్టీన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ విషయం కీర్ స్టార్మర్‌కు తెలిసే నియామకం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి.

ఎప్‌స్టీన్‌తో మాండెల్సన్ సంబంధాలు..
ఇక ఎప్‌స్టీన్ బాలికలతో అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడని నిర్ధారణ జరిగి దోషిగా తేలినప్పటికీ లార్డ్ పీటర్ మాండెల్సన్‌ అతడితో స్నేహం కొనసాగించినట్లుగా తేలింది. దీంతో గత సెప్టెంబర్‌లో మాండెల్సన్‌ను రాయబారిగా కీర్ స్టార్మర్ తొలగించారు. తాజాగా నియామకంపై విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి మోసాన్ని సహించబోమని.. ఎవరూ జవాబుదారీతనానికి అతీతులు కారని పేర్కొన్నారు. అంతేకాకుండా అధికారంలో ఉన్న చాలా మంది వైఫల్యాలను స్టార్మర్ అంగీకరించారు.

లార్డ్ పీటర్ మాండెల్సన్‌ కుంభకోణం
ఇదిలా ఉంటే లార్డ్ పీటర్ మాండెల్సన్‌ 2008లో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు మాండెల్సన్ అత్యంత రహస్య ప్రభుత్వ సమాచారాన్ని ఎప్‌స్టీన్‌కు అందజేసినట్లుగా ఇటీవల అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన పత్రాల్లో వెల్లడైంది. అంతేకాకుండా మాండెల్సన్-ఎప్‌స్టీన్ మధ్య వందలాది టెక్ట్స్ మెసేజ్‌లు, ఈ-మెయిల్స్ సందేశాలు ఉన్నాయి. 2003లోనే ‘‘నా బెస్ట్ ఫ్రెండ్’’ అని మాండెల్సన్ పేర్కొన్నాడు. దీంతో ఇద్దరి మధ్య ఏ స్థాయిలో సంబంధాలు ఉన్నాయో అర్థమవుతోంది. ఇక ఎప్‌స్టీన్ నుంచి చాలా నగదు అందుకున్నట్లుగా బహిర్గతం అయింది. ఆదివారం లేబర్ పార్టీకి రాజీనామా చేస్తూ ఆ డబ్బు గురించి తనకేమీ తెలియదని.. గుర్తులేదని మాండెల్సన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో ఉన్నాడు. ఇక మంగళవారం హౌస్ ఆఫ్ లార్డ్స్ నుంచి వైదొలిగాడు. ఇటీవల న్యాయశాఖ విడుదల చేసిన ఫొటోల్లో గుర్తుతెలియన మహిళతో మాండెల్సన్ ఉన్నట్లుగా కనిపించింది.

స్టార్మర్‌కు ఇక్కట్లు..
ఇక మాండెల్సన్ కుంభకోణం బయటకు వచ్చాక ప్రధాని కీర్ స్టార్మర్‌పై లేబర్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సొంత పార్టీ ఎంపీలతో పాటు విపక్ష ఎంపీల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజీనామా చేయాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ముందు జాగ్రత్తగా కీర్ స్టార్మర్ క్షమాపణలు చెప్పారు. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

Exit mobile version