Site icon NTV Telugu

భార‌త్ వ్యాక్సిన్‌పై యూఏఈ క్లారిటీ… ఆ టీకా వేయించుకుంటే…

ఇండియాలో సీరం ఇన్‌స్టిట్యూట్ త‌యారు చేస్తున్న కోవీషీల్డ్ వ్యాక్సిన్ ను అనేక దేశాల‌కు ఎగుమ‌తి చేస్తున్నారు.  ఆక్స్‌ఫ‌ర్డ్‌-అస్త్రాజెన‌కా టీకాను ఇండియాలో సీరం ఇన్‌స్టిట్యూట్ కోవీషీల్డ్ పేరిత ఉత్ప‌త్తి చేస్తున్న‌ది.  అక్స్‌ఫ‌ర్డ్-అస్త్రాజెన‌కా టీకాను అనేక దేశాలు ఆమోదం తెలిపాయి.  ఇందులో యూఏఈ కూడా ఉన్న‌ది.  భార‌తీయులు ఎక్కువ‌గా ఉపాది కోసం గ‌ల్ఫ్ దేశాల‌కు వెళ్తుంటారు.  ముఖ్యంగా యూఏఈకి వెళ్లే వ్య‌క్తుల సంఖ్య అధికంగా ఉంటుంది.  కోవీషీల్డ్ తీసుకున్న భార‌తీయులు ఎలాంటి సందేహం అవ‌స‌రం లేకుండా యూఏఈకి రావోచ్చ‌ని అధికారులు స్ఫ‌ష్టంచేశారు.  ఆక్స్‌ఫ‌ర్డ్ టీకా యూఏఈలో ఆమోదం పొందింద‌ని, దుబాయ్‌కి వ‌చ్చే వారికి మ‌రో టీకా అవ‌స‌రం లేద‌ని అధికారులు తెలిపారు.  

Exit mobile version