Philippines Typhoon: ఫిలిప్పీన్స్‌పై విరుచుకుపడ్డ భారీ తుఫాన్.. 241 మంది మృతి
- ఫిలిప్పీన్స్‌పై విరుచుకుపడ్డ భారీ తుఫాన్
- 241 మంది మృతి.. వందలాది మంది గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అత్యంత శక్తివంతమైన కల్మేగి తుఫాను ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేసింది. బుధవారం తుఫాన్ నానా బీభత్సం సృష్టించింది. ప్రకృతి విలయానికి దాదాపు 241 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయాలు పాలయ్యారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోష్ల మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
- Ilhan Omar: పచ్చి భారత వ్యతిరేకి ఎల్హాన్ ఒమర్, మరోసారి విషం చిమ్మింది..
- Explained: యుద్ధంలో ట్రంప్ ఘోర పరాజయం.. ప్రపంచం ముందు నవ్వులపాలైన అమెరికా!
- Hormuz Strait: ప్రపంచానికి ఊపిరి పోసిన అమెరికా-ఇరాన్ ఒప్పందం.. హర్మూజ్ గుండా చమురు రవాణా షురూ..
- Giorgia Meloni: జీ 7 సదస్సుకు కుమార్తెతో హాజరైన మెలోని.. ఫొటోలు వైరల్
ఇదిలా ఉంటే గురువారం ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్టినాండ్ మార్కోస్ జూనియర్.. దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మరణాలు ఎక్కువగా ఉన్నాయని.. ఆకస్మిక వరదలు కారణంగా అనేక మంది కొట్టుకుపోయారని తెలిపారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: Bengaluru: జంట ఘాతుకం.. ఇంటి యజమానిని చంపి మంగళసూత్రంతో పరారీ
తుఫాన్ ప్రభావానికి 2 మిలియన్ల ప్రజలు ప్రభావితం అయ్యారు. 560,000 మంది గ్రామస్తులు నిరాశ్రయులయ్యారు. దాదాపు 450,000 మందిని అత్యవసర ఆశ్రయాలకు తరలించినట్లు పౌర రక్షణ కార్యాలయం తెలిపింది. ఇక తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రావిన్సులకు మానవతా సాయం అందించేందుకు వెళ్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. దీంతో ఆరుగురు చనిపోయినట్లు సైన్యం తెలిపింది. ప్రమాదానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.
కల్మేగి తుఫాన్ కారణంగా భారీ వరదలు సంభవించాయి. సెబు ప్రావిన్స్‌లో నది, జలమార్గాలు ఉప్పొంగి ప్రవహించాయి. ఫలితంగా నివాస ప్రాంతాలు మునిగిపోయాయి. పైకప్పులపైకి ఎక్కి రక్షించాలని ప్రజలు ప్రాధేయపడ్డారు. ఇక సెబులో కనీసం 71 మంది మరణించగా.. ఎక్కువగా నీటిలో మునిగిపోవడం వల్ల మరో 65 మంది తప్పిపోయారని, 69 మంది గాయపడ్డారని సివిల్ డిఫెన్స్ కార్యాలయం తెలిపింది. సెబు సమీపంలో ఉన్న నీగ్రోస్ ఆక్సిడెంటల్ సెంట్రల్ ప్రావిన్స్‌లో మరో 62 మంది తప్పిపోయినట్లు నివేదించబడింది. తుఫాన్ విషయంలో మేము చేయగలిగినదంతా చేశామని.. ఊహించని రీతిలో ఆకస్మిక వరదలు సంభవించాయని సెబు గవర్నర్ పమేలా బారికువాట్రో తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: మెరిసిన వైభవ్ సూర్యవంశీ.. కానీ మళ్లీ బయటపడిన అదే బలహీనత
-
IMD Rain Alert: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాల్లో రుతుపవనాలు.. ఎప్పటి నుంచి వర్షాలంటే..!
-
Gatta Kusthi 2: “విష్ణు విశాల్ పట్టుబట్టబట్టే ‘గట్ట కుస్తీ 2’ సాధ్యమైంది”.. నెట్‌ఫ్లిక్స్ రిజెక్షన్ టు సీక్వెల్ సీక్రెట్స్ విప్పిన డైరెక్టర్!
-
IND Vs AFG: టీమిండియా ఊచకోత.. గిల్, ఇషాన్ కిషన్ విశ్వరూపం.. భారీ స్కోర్ దిశగా ఇండియా..
-
Peddi : 400 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయిన రామ్ చరణ్ పెద్ది
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!