చార్లీ కిర్క్.. ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది. గత బుధవారం అమెరికాలోని ఉతా వ్యాలీ యూనివర్సిటీలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతుండగా దుండగుడు జరిపిన తుపాకీ కాల్పులకు కుప్పకూలి ప్రాణాలు వదిలారు. అనంతరం 33 గంటల తర్వాత 22 ఏళ్ల నిందితుడు టైలర్ రాబిన్సన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటన తర్వాత నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని ట్రంప్ ప్రకటించారు. దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది. వేలాదిగా ప్రజలు తరలివచ్చి నివాళులర్పించారు.
ఇది కూడా చదవండి: PM Modi at 75: 75వ బర్త్‌డే చేసుకుంటున్న మోడీ.. రాజకీయ ప్రస్థానమిదే!
తాజాగా నిందితుడు రాబిన్సన్‌కు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారం క్రితమే ఈ హత్యకు ప్రణాళిక రచించినట్లుగా నిందితుడు పోలీసులకు తెలియజేశాడు. ఈ మేరకు కోర్టుకు దాఖలు చేసిన పత్రాల్లో పోలీసులు పేర్కొన్నారు. ఇక హత్య గల కారణాలను నిందితుడు ముందుగానే ఒక నోట్‌పై రాశాడు. దాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తితో కలిసి ఉంటున్నట్లుగా గుర్తించారు.
ఇది కూడా చదవండి: Rabies Vaccine: ఎంత పనిచేసినవ్ డాక్టరూ!.. జ్వరం చికిత్స కోసం వస్తే.. రేబీస్ టీకా వేసిన వైనం
ఇక చార్లీ కిర్క్‌ను హత్య చేసిన నిందితుడు రాబిన్సన్.. లింగమార్పిడి భాగస్వామితో నిత్యం టచ్‌లోనే ఉన్నాడు. వరుస సందేశాలతో నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే పోలీసులు స్పష్టమైన కారణాన్ని చెప్పలేదు గానీ.. కోర్టుకు దాఖలు చేసిన ప్రకారం.. చార్లీ కిర్క్ ద్వేషాన్ని రగిలిస్తున్నారని.. ఆ కారణంతోనే నిందితుడు చంపినట్లుగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ద్వేషం తనకు విసుగు తెప్పించిందని.. కొన్ని ద్వేషాలను పరిష్కరించలేమని రాబిన్సన్ తన భాగస్వామితో పంచుకున్న టెస్ట్ మెసేజ్ వెలుగులోకి వచ్చింది.
చార్లీ కిర్క్.. ‘గే’ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది తప్పంటూ ప్రసంగాలు చేస్తున్నారు. పురుషుడు-పురుషుడు, స్త్రీ-స్త్రీ వివాహం చేసుకోవడం ప్రకృతి విరుద్ధమంటూ ఆయా సభల్లో చార్లీ కిర్క్ ప్రసంగాలు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు రాబిన్సన్.. లింగమార్పిడి చేసుకున్న వ్యక్తితోనే సహజీవనం చేస్తున్నాడు. ఈ కారణంతోనే రాబిన్సన్ కోపంతో రగిలిపోయి ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.
రాబిన్సన్ దర్యాప్తు సంస్థలకు ఏ మాత్రం సహకరించడం లేదని సమాచారం. అయితే టెస్ట్ మెసేజ్‌లు డిలీట్ చేయాలని తన భాగస్వామికి ముందుగానే తెలియజేశాడు. ఇక గతేడాది నుంచి స్వలింగ సంపర్కులకు.. లింగమార్పిడి హక్కులకు రాబిన్సన్ మద్దతు ఇస్తున్నట్లుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అతని స్నేహితులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు.
అయితే కుటుంబ సభ్యుల సూచన మేరకే రాబిన్సన్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఇక నిందితుడిపై తుపాకీ ప్రయోగించినందుకు జీవిత ఖైదు, లేదంటే 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించదగిన నేరాలు మోపబడ్డాయి.
