Site icon NTV Telugu

Shocking Story: శవపేటిక దగ్గర కొట్టుకున్న ఇద్దరు ప్రియురాళ్లు.. వీడియో వైరల్

Us

Us

శవాల దగ్గర ఆస్తుల కోసం.. పంపకాల కోసం కొట్లాడుకున్న సంఘటనలు చూశాం. విన్నాం. కానీ ఆశ్చర్యంగా ఒక శవపేటిక దగ్గర మాత్రం శవం కోసం ఇద్దరు ప్రియురాళ్లు ముష్టి యుద్ధానికి దిగారు. ఒకరినొకరు తోసుకుంటూ.. పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Trump-China: హార్ముజ్ తెరిచి ఉంచాం.. చైనా సంతోషంగా ఉందన్న ట్రంప్

అమెరికాలో ఇద్దరు మహిళలు ఒక వ్యక్తితో డేటింగ్ చేశారు. ఒకరికి తెలియకుండా ఒకరు ప్రేమించారు. అయితే ప్రేమికుడు చనిపోయాడని విషయం తెలియగానే ప్రియురాలిద్దరూ వాలిపోయారు. అయితే అంత్యక్రియలకు సిద్ధపడుతున్న తరుణంలో మహిళిద్దరికీ అసలు విషయం తెలిసింది. దీంతో తన వాడు అంటూ ఇద్దరూ వాదనకు దిగారు. పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. ఒకరినొకరు తోసుకుంటూ.. కొట్టుకోవడంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురై ఆపడానికి ప్రయత్నించారు. అయినా కూడా చాలా సేపు వరకు పరిస్థితి ఉద్రిక్తంగానే కనిపించింది. ఈ క్రమంలో శవపేటిక కూడా పడిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ప్రస్తుతం వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇది దిగ్భ్రాంతికర విషయం అని ఒకరు అనగా.. నిజాయితీ లేకపోతే ఇలానే ఉంటుందని మరొకరు రాసుకొచ్చారు.

Exit mobile version