NTV Telugu Site icon

Japan: ఒకే రన్‌వే పైకి రెండు విమానాలు

Planes

Planes

Japan: జపాన్‌లోని ఒక విమానాశ్రయంలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఒకే రన్‌వే పైకి రెండు విమానాలు రావడంతో ఒకదానికొకటి తాకాయి. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఒకే రన్‌వే పైకి రెండు విమానాలు రావడంతో ఆ రన్‌వేను తాత్కాలికంగా మూసివేసినట్టు విమానాశ్రయాధికారులు ప్రకటించారు. టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో రెండు విమానాలు ఒకే రన్‌వే పైకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది రన్‌వేను మూసివేశారు. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు ప్రకటించారు.

Read also:Iyer Clash In Kanchipuram: తమిళనాడులో కొట్టుకున్న అర్చకులు.. ఎందుకో తెలుసా..?

జపాన్ రవాణా మంత్రిత్వ శాఖ మరియు టోక్యో అగ్నిమాపక శాఖ ప్రకారం.. థాయ్ ఎయిర్‌వేస్ మరియు తైవాన్‌కు చెందిన ఎవా ఎయిర్‌వేస్ నిర్వహిస్తున్న వాణిజ్య విమానాలు ఒకే రన్‌వేపైకి వచ్చాయి. టోక్యోలోని హనేడా ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వే టాక్సీవేలో రెండు విమానాలు రావడంతో రన్‌వేను మూసివేయబడిందని.. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని.. ఎటువంటి నష్టం జరగలేదని జపాన్ రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. హనేడా వద్ద ఉన్న నాలుగు రన్‌వేలలో.. రన్‌వే A ప్రమాదం తర్వాత కార్యకలాపాల కోసం మూసివేయబడింది.NHK ప్రసారం చేసిన ఫుటేజీలో, అగ్నిమాపక శాఖ అధికారులు మరియు ఇతర సిబ్బంది టాక్సీవే వద్ద గుమిగూడడంతో రన్‌వేపై ఉన్న రెండు విమానాలు ఆగిపోయాయి. విమానాల సమీపంలో భూమిపై కూడా గుర్తు తెలియని శిధిలాలు కనిపిస్తున్నట్టు నివేదికలు సూచిస్తున్నాయి.